బాలయ్య (BalaKrishna), మోక్షజ్ఞ కలిసి నటిస్తున్నారా?

Updated on Apr 29, 2022 03:45 PM IST
బాలయ్య (BalaKrishna) పుట్టినరోజు వేడుకలో మోక్షజ్ఞ
బాలయ్య (BalaKrishna) పుట్టినరోజు వేడుకలో మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ (BalaKrishna) వారసుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ కోసం ప్రముఖ రచయిత సాయి మాధవ్‌ ప్రత్యేకంగా కథను రెడీ చేశాడని, దానికి బాలయ్య కూడా ఓకే చెప్పాడని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి.

అయితే కొన్నాళ్లకు అవన్నీ పుకారులే అని తేలాయి. బాలకృష్ణతో ‘పైసా వసూల్‌’ వంటి సినిమా తీసి సూపర్‌‌హిట్ అందించిన పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతోందని ప్రచారం జరిగింది. అది కూడా వట్టి ప్రచారమేనని తెలిసింది. ఇప్పుడు తాజాగా మరో ప్రచారం ఇండస్ట్రీలో సాగుతోంది.

బాలకృష్ణ, మోక్షజ్ఞ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ యాక్షన్‌ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్న ఈ సినిమా ఫస్ట్​లుక్‌ పోస్టర్‌‌ ఇటీవల విడుదలైంది. దానికి విశేష స్పందన వచ్చింది. రవితేజతో ‘క్రాక్‌’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ సినిమా తీసిన తర్వాత గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

తాజాగా మోక్షజ్ఞ చేసిన ఒక ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా అవుతోంది. ‘నైట్‌ షూట్ #NBK107’ అని మోక్షజ్ఞ తన ట్విట్టర్‌‌ అకౌంట్‌లో పోస్ట్‌ పెట్టాడు. మోక్షజ్ఞ చేసిన ఈ ట్వీట్‌పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మోక్షజ్ఞ మొదటి సినిమా బాలయ్య సినిమానేనా అని అభిమానులు అనుకుంటున్నారు.

బాలకృష్ణ సినిమాతోనే మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అని ట్వీట్‌ చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే బాలయ్య, మోక్షజ్ఞ కలిసి నటిస్తున్నారా? లేకపోతే కేవలం షూటింగ్‌ చూడడానికే మోక్షజ్ఞ వచ్చాడా? అనేది తెలియాల్సి ఉంది.

ఇక, ఈ సినిమా తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో నాలుగో సినిమా రాబోతోంది. పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాను 2024 ఎన్నికలకు ముందుగా రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బాలకృష్ణ(BalaKrishna)–బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాల్లోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా అఖండ పాత్రతో నటసింహం అని మరోసారి నిరూపించుకున్నారు. బాలయ్య నోట పలికించే  బోయపాటి సంభాషణలకున్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. వీరిద్దరి కాంబినేషన్​లో సినిమా రిలీజైందంటే చాలు చిన్నాపెద్దా తేడాలేకుండా అందరి నోటా కొన్నేళ్లపాటు ఆ డైలాగ్​లు వినిపిస్తూనే ఉంటాయి.

బాలకృష్ణ (BalaKrishna) ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్​ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తవగానే సెప్టెంబర్​లో దర్శకుడు అనిల్ రావిపూడితో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. బోయపాటి కూడా ఎనర్జిటిక్​ స్టార్​ రామ్​తో ఓ పాన్​ ఇండియా సినిమా ప్లాన్​ చేస్తున్నారు. వీరిద్దరూ కమిట్​ అయిన చిత్రాలు పూర్తవగానే వీరి కాంబోలో చిత్రం ప్రారంభం కానుందని టాలీవుడ్​ టాక్​.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!