కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుందంటున్న సిద్దార్ధ్‌ (Siddharth)

Updated on May 01, 2022 08:47 PM IST
సిద్దార్ధ్‌ (Siddharth)
సిద్దార్ధ్‌ (Siddharth)

బాయ్స్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరో సిద్దార్ధ్‌ (Siddharth). తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగులో స్టార్ హీరోల సరసన నిలబడ్డాడు. ఈ మధ్య కాలంలో సరైన సినిమాల్లేక తెలుగు ప్రేక్షకులకు దూరమైనా వేరే భాషా సినిమాలు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో యాక్టివ్‌గా ఉంటాడు సిద్దార్ధ్‌.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా పాన్‌ ఇండియా అనే పదమే వినిపిస్తోంది, ఇటీవల పుష్ప, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌, కేజీఎఫ్‌2 సినిమాలు పాన్‌ ఇండియా సినిమాలుగా విడుదలై ఘనవిజయాన్ని అందుకున్నాయి. పాన్‌ ఇండియా పదం ఎక్కువగా వాడకంలోకి రావడంతో అటు నార్త్‌ హీరోలకు, ఇటు సౌత్‌ హీరోలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై హీరో సిద్దార్ధ్‌ స్పందించాడు.

అసలు పాన్‌ ఇండియా అనే పదమే నాన్సెన్స్‌ అని సంచలన కామెంట్స్ చేశాడు. ‘ఇక్కడ చేసేవి అన్ని ఇండియా సినిమాలే అయినప్పుడు వాటిని పాన్‌ ఇండియా సినిమాలు అని ఎందుకు పిలవాలి? 15 ఏళ్ల క్రితమే మణిరత్నం డైరెక్టర్‌‌గా ‘రోజా’ సినిమా తీశారు. అన్ని భాషల ప్రేక్షకులు ఆ సినిమా చూశారు. రీసెంట్‌గా నా ఫ్రెండ్స్‌ కేజీఎఫ్‌ సినిమా తెరకెక్కించారు.

సినిమాను ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చూసే హక్కు ప్రేక్షకుడికి ఉంటుంది. అందుకే పాన్ ఇండియా అనే పదాన్ని తీసేసి ఇండియన్ సినిమా అని పేరు పెట్టాలి. అదీ కాకుంటే ఏ భాషలో తీస్తే ఆ భాషతోనే పిలిస్తే సరిపోతుంది. ఒక సినిమా బాగా రావాలంటే టాలెంట్ ఉన్న టెక్నీషియన్లు కావాలి. వాళ్లకు లాంగ్వేజ్‌తో సంబంధం లేదు. అసలు వాళ్లకు ఆ భేదమే ఉండదు. కథ, కథాంశం ఉంటే ఏ సినిమా అయినా, ఏ భాష అయినా హిట్‌ అవుతుంది. దానికి పాన్‌ ఇండియా సినిమా అని బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదని సిద్దార్ధ్‌ (Siddharth) కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ఎవరైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి మరి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!