తన లైఫ్‌లోనూ బ్రేకప్ ఉందంటున్న విశ్వక్సేన్ (Vishwak Sen)

Updated on Apr 29, 2022 06:49 PM IST
విశ్వక్సేన్ (Vishwak Sen)
విశ్వక్సేన్ (Vishwak Sen)

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, పాగల్ వంటి ప్రేమకథా చిత్రాలతో తెలుగు ప్రేక్షుకుల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుని హీరోగా ఎదిగాడు విశ్వక్ సేన్ (Vishwak Sen).  తాజాగా విశ్వక్ నటించిన అశోక వనంలో అర్జున కల్యాణం మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. పెళ్లి కోసం ఎదురుచూసే ఓ 30 ఏళ్ల వ్యక్తి ఎదుర్కునే ఇబ్బందులను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్ విద్యాసాగర్ చింతా.  ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న విశ్వక్ ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్లో జరిగిన కొన్ని బాధాకరమైన విషయాలను పంచుకున్నాడు. 

అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా కథ, కథనం గురించి మాట్లాడుతూ నిజంగా తనలైఫ్లోనూ ఓ బ్రేకప్ స్టోరీ ఉందన్నాడు విశ్వక్. ఓ అమ్మాయిని మూడేళ్లు గాఢంగా ప్రేమిస్తే ఆమె తనకు బ్రేకప్ చెప్పేసిందని, కనీసం కారణమేంటో కూడా తనకు తెలియదని, బ్రేకప్ విషయం కూడా తనకు నెలరోజుల తర్వాత తెలిసిందని తన మనసులోని బాధను పంచుకున్నాడు హీరో విశ్వక్ సేన్. 

దాదాపుగా విశ్వక్ నటించినవన్నీ ప్రేమకథలే. ఆయా సినిమాల్లోనూ కచ్చితంగా బ్రేకప్ సన్నివేశాలు, పాటలు ఉండడంతో చాలారోజులుగా అభిమానుల్లో విశ్వక్ కథల ఎంపిక వెనుక కారణమేంటో తెలుసుకోవాలనే కుతూహలం ఉంది. అందుకే ప్రస్తుత సినిమా ప్రమోషన్లలోనూ అవే ప్రశ్నలు ఎదురవడంతో తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్నాడు విశ్వక్. తను ఇప్పటివరకు ఒకేసారి ప్రేమలో పడ్డాననీ, అది కూడా బ్రేకప్ అయ్యిందని తన భగ్నప్రేమ కథను చెప్పుకొచ్చాడు.

"ప్రతి మగాడి లైఫ్ లో బ్రేకప్ ఉంటుంది. దాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు. నా లైఫ్ లో కూడా ఒక బ్రేకప్ ఉంది. అంతకుమించి ఎక్కువ బ్రేకప్స్ నాకు జరగలేదు. ఓ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాను. కాలేజీలో మూడేళ్లు చూశాను. కాలేజ్ లో ఉన్నప్పుడు మాట్లాడలేదు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఓ ఫ్రెండ్ పార్టీలో కలిశాం. ఓ ఘటన వల్ల ఇద్దరం దగ్గరయ్యాం. అంతా ఓకే అనుకున్నాను. కానీ మా జర్నీలో ఆ అమ్మాయి నాకు ఎప్పుడో బ్రేకప్ చెప్పేసింది. ఆ విషయం 30 రోజుల తర్వాత నాకు తెలిసింది. తను మొదటి రోజు లేదా 7వ రోజు చెబితే బాగుండేది. కానీ నాకు నెల రోజుల తర్వాత తెలిసింది.

అది చాలా బాధాకరం." ఆ బ్రేకప్ తర్వాత చాలా ఎమోషనల్ అయ్యానని, అందుకే తన సినిమాల్లో ఎక్కువగా బ్రేకప్ సీన్స్ ఉంటాయని తెలిపాడు విశ్వక్ సేన్. బ్రేకప్ అయినప్పుడు ఏడుపు పాటలు కాకుండా, కాస్త జోష్ ఉన్న సాంగ్స్ పెట్టమని తనే దర్శకులకు చెబుతుంటానని అన్నాడు. అందుకే తన సినిమాల్లో బ్రేకప్ పాటలు కూడా ఫుల్ జోష్ గా ఉంటాయన్నాడు.

ఈ హీరో నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా విడుదలకు సిద్ధమైంది. వయసైపోతున్నా ఇంకా పెళ్లి కాని అబ్బాయి పాత్రలో విశ్వక్ (Vishwak Sen) ఇందులో నటించాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!