డ్రెస్సింగ్‌ కారణంగా వచ్చే గౌరవం నాకు అక్కర్లేదు : నెటిజన్‌తో బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి (Bindu Madhavi)

Updated on Aug 06, 2022 02:24 PM IST
బిందు మాధవి (Bindu Madhavi)  ఇటీవల షేర్ చేసిన ఫోటోలు
బిందు మాధవి (Bindu Madhavi) ఇటీవల షేర్ చేసిన ఫోటోలు

సోషల్‌ మీడియాలో తనపై నెగెటివ్‌ కామెంట్‌ చేసిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు బిగ్‌బాస్‌ విన్నర్ బిందు మాధవి (Bindu Madhavi). ఆవకాయ్ బిర్యానీ, బంపర్‌ ఆఫర్‌ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ బిందు. తెలుగమ్మాయి అయిన బిందు ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకున్నారు.

కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటూ సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో తెలుగు బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఓటీటీ కంటెస్టెంట్‌గా సెలెక్ట్‌ అయ్యారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనదైన ఆట, యాటిట్యూడ్, మాటలతో తోటి కంటెస్టెంట్లకు పోటాపోటీగా నిలిచి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ టైటిల్‌ గెలుచుకున్నారు బిందు.

అంతేకాదు సాంప్రదాయమైన దుస్తులనే ధరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బిందు మాధవి. అయితే తన తాజా పోస్ట్‌లో కాస్త ట్రెండీ డ్రెస్‌లో కనిపించారు. ఈ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  ఈ క్రమంలో ఒక నెటిజన్‌ బిందు డ్రెసింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

బిందు మాధవి (Bindu Madhavi)  చేసిన ట్వీట్

గౌరవం పెరిగింది కానీ..

బిగ్‌బాస్‌ హౌజ్‌లో అందరూ శరీరం కనిపించేలా బట్టలు వేసుకుంటే.. తను మాత్రం కేవలం సాంప్రదాయమైన అలంకరణకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో బిందు మాధవిపై గౌరవం పెరిగింది. కానీ ఈ పోస్ట్‌లో ఆమె వేసుకున్న దుస్తులు చూసిన తర్వాత ఆ గౌరవం పోయింది. అందరి దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే బిగ్‌బాస్ హౌస్‌లో బిందు సాంప్రదాయ దుస్తులు ధరించింది’ అంటూ విమర్శించారు ఒక నెటిజన్.

సదరు నెటిజన్‌ చేసిన కామెంట్స్‌ పై బిందు స్పందించారు. తనదైన స్టైల్‌లో గట్టి కౌంటర్‌ ఇచ్చారు.  ‘హో.. మనం ధరించే దుస్తులను బట్టే వ్యక్తికి గౌరవం ఇస్తారంటే.. అలాంటి గౌరవం నాకు వద్దు’ అంటూ నెటిజన్‌ నోరు మూయించారు బిందు. బిందు మాధవి ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. బిందు ఇచ్చిన రిప్లైకు మరో నెటిజన్‌ ఫిదా అయ్యారు. ఈ కామెంట్స్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ బిందు మాధవి(Bindu Madhavi)కి మద్దతు తెలిపారు. 

Read More : పుష్ప2 సినిమా బడ్జెట్‌లో సగం అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ రెమ్యునరేషన్లకే.. మరీ అంత తీసుకుంటున్నారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!