‘రిచా గంగోపాధ్యాయ’ (Richa Gangopadhyay) ఇప్పుడెలా ఉందో చూడండి
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాలు తక్కువగా ఉన్నాయనే కారణంతో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతూ ఉంటారు. అటువంటి కోవలోకి చెందిన హీరోయినే రిచా గంగోపాధ్యాయ (Richa Gangopadhyay). శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లీడర్’ సినిమాతో రానాతోపాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రిచా గంగోపాధ్యాయ. ఆ సినిమా హిట్ కావడంతో తర్వాత వరుసగా అవకావాలు అందుకున్న ఈ బ్యూటీ.. రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘మిరపకాయ్’, వెంకటేష్ హీరోగా వచ్చిన ‘నాగవల్లి’, సారొచ్చారులో నటించి మంచి మార్కులే వేయించుకుంది.
అయితే తరువాత సరైన అవకాశాలు రాలేదు ఈ భామకు. 2013లో నాగార్జున హీరోగా వచ్చిన ‘భాయ్’ సినిమాలో చివరిగా కనిపించింది రిచా. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది
ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పిన తర్వాత రిచా.. తన ఫ్రెండ్ జో లాంగేల్లాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పోయినేడాది మగబిడ్డకు జన్మనిచ్చింది. సినిమాలకు దూరమైన తర్వాత ఎక్కడా కనిపించని రిచా గంగోపాధ్యాయ.. ఫ్యామిలీ పిక్చర్ ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నీలం రంగు ఓణీలో కొడుకును ఎత్తుకుని పక్కనే భర్తతో ‘రిచా గంగోపాధ్యాయ’ (Richa Gangopadhyay) ఉన్న చిత్రం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.