హిందీ ఇక జాతీయ భాష కాదు: కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)

Updated on Apr 26, 2022 11:20 AM IST
ప్రెస్‌మీట్‌లో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)
ప్రెస్‌మీట్‌లో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కిచ్చా సుదీప్ (Kiccha Sudeep). అందులోని నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు. కథలో ప్రాముఖ్యాన్ని బట్టి హీరో, విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్‌, చిన్న పాత్ర, పెద్ద క్యారెక్టర్ అనే తేడా లేకుండా నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి కథ, కథనం, కథాంశంతో తెరకెక్కిన సినిమాల్లో చిన్న పాత్రల్లోనైనా నటిస్తున్నాడు. ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాల్లో కూడా అలాగే నటించాడు కూడా. ప్రస్తుతం కిచ్చా సుదీప్ ‘విక్రాంత్‌ రోణ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పాన్‌ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 28న విడుదలవుతోంది.

 కేజీఎఫ్‌2 సినిమాపై కిచ్చా సుదీప్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో బాలీవుడ్‌పై సంచలన కామెంట్లు కూడా చేశారు. "ఒక కన్నడ సినిమాను పాన్‌ ఇండియా సినిమాగా తీశారని కొందరు అంటున్నారు. ఈ మాటలను కొద్దిగా మార్చాలని అనుకుంటున్నాను. హిందీ ఇక ఏ మాత్రం జాతీయ భాష కాదు. ప్రస్తుతం బాలీవుడ్‌ ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. వాటిని తెలుగు, తమిళ భాషల్లో డబ్‌ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అయితే అవి మాత్రం అంతగా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోతున్నాయి. కానీ, కన్నడ భాషలో తీసే సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి" అని ఒక ప్రెస్‌మీట్‌లో సుదీప్ అన్నారు. సుదీప్‌ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్లపై ఎవరైనా స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హీరోగా నటించిన ఫాంటసీ సినిమా ‘విక్రాంత్‌ రోణ'కు అనూప్‌ భండారీ దర్శకత్వం వహిస్తున్నారు. జాక్‌ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిరూప్ భండారీ, నీతా అశోక్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ కనిపించనున్నారు. త్రీ డీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘విక్రాంత్‌ రోణ’ టీజర్‌‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. చిన్న పిల్లల వాయిస్‌తో స్టార్ట్‌ అయ్యే టీజర్‌‌లో.. ఒక షిప్‌లో నుంచి బయటికి వస్తున్న సుదీప్‌ ఎంట్రీ ఆకట్టుకునేలా ఉంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!