Ranga Ranga Vaibhavanga Movie Review: వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej) ‘రంగ రంగ వైభవంగా’ ..రొటీన్ ఫ్యామిలీ డ్రామా

Updated on Sep 03, 2022 11:51 AM IST
వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej) హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా శుక్రవారం రిలీజైంది
వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej) హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా శుక్రవారం రిలీజైంది

సినిమాకు కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు, సంగీతం అన్నీ కుదిరితే ఫ్యామిలీ జానర్‌‌ సినిమాలు సూపర్‌‌హిట్‌ అవుతాయి. ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్లు చూడడానికి ప్రేక్షకులు కుటుంబంతో కలిసి వస్తుంటారు గనుక కలెక్షన్లు కూడా బాగానే ఉంటాయి. ఉప్పెన సినిమాలో మాస్‌ క్యారెక్టర్‌‌లో, కొండ పొలం సినిమాలో మరో క్యారెక్టర్‌‌ చేసిన వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej) తన మూడో సినిమాగా ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌ను ఎంపిక చేసుకున్నారు.

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌ ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రొమాంటిక్ సినిమా ఫేమ్‌ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రంగ రంగ వైభవంగా సినిమా ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంగ రంగ వైభవంగా సినిమా ఎలా ఉందో ఒక లుక్‌ వేద్దాం..

కథ ఏంటంటే..

రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతిక శర్మ) పక్కపక్క ఇళ్లలో ఉంటారు. మంచి ఫ్రెండ్స్. వీళ్ల కుటుంబాలు కూడా కలిసే ఉంటాయి. చిన్నప్పటి నుంచి వీరిద్దరూ కలిసే పెరుగుతారు. స్కూల్‌లో చదివే రోజుల్లో జరిగిన గొడవలతో మాట్లాడుకోవడం మానేస్తారు. పైకి వీరిద్దరూ కోపాన్ని చూపిస్తున్నా రిషి, రాధ మనసుల్లో మాత్రం  స్నేహం, ప్రేమ అలాగే ఉంటాయి.  కొన్ని సంఘటనల కారణంగా వీళ్ల రెండు కుటుంబాలూ దూరమవుతాయి.  స్నేహంగా ఉండే కుటుంబాలను తిరిగి దగ్గర చేసేందుకు రాధ, రిషి ఎటువంటి ప్రయత్నం చేశారు. రిషి, రాధ ప్రేమకు రాధ సోదరుడు (నవీన్ చంద్ర) ఎందుకు అడ్డుగా నిలిచారు. ఆ అడ్డంకులు దాటి వాళ్ల ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనేది రంగ రంగ వైభవంగా సినిమా కథ.

వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej) హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా శుక్రవారం రిలీజైంది

ఎవరెలా నటించారంటే..

రిషి పాత్రలో వైష్ణవ్ తేజ్ నటన ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌‌లో ఎనర్జిటిక్‌గా నటించారు వైష్ణవ్. లవ్, ఎమోషన్ సీన్స్‌లో ఆయన నటన బాగుంది. కేతిక కూడా తన పరిధిలో బాగానే నటించినప్పటికీ మరింత బాగా నటించేందుకు ఆస్కారం ఉందని అనిపించింది. నరేష్, ప్రభు, ప్రగతి, తులసి అందరూ తమ క్యారెక్టర్‌‌కు న్యాయం చేశారు. నవీన్ చంద్ర క్యారెక్టర్ కథలో సీరియస్‌నెస్ తీసుకొస్తుంది. ఇటువంటి క్యారెక్టర్‌‌లో నటించి మెప్పించడం నవీన్‌ చంద్రకు పెద్ద కష్టమేమీ కాదు.

ఎలా ఉందంటే..

రంగ రంగ వైభవంగా’ సినిమా ప్రేక్షకులకు తెలిసిన కథే. హీరోహీరోయిన్లు పక్కపక్క ఇళ్లల్లో ఉండడం, ఒకరితో ఒకరికి గొడవలు, తిరిగి కలుసుకోవడం, ప్రేమించుకోవడం ఇటువంటి కథలతో చాలా సినిమాలే వచ్చాయి. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఇటువంటి పాత జానర్ కథను తీసుకున్నప్పుడు.. దర్శకుడు ఎంతో కొంత కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తే బాగుండేది. దాదాపు చాలా సంవత్సరాలుగా ఇది తెలిసిన కథే, ఊహించగలిగే కథనం వల్ల సినిమా చూసే ప్రేక్షకులు ఏ మాత్రం ఎగ్జైట్ అవ్వరు. ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌ అనే సక్సెస్‌ఫుల్ ఫార్ములాను.. ఉపయోగించుకోవడంలో  దర్శకుడు గిరీశాయ సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి.

కలర్‌‌ఫుల్ సినిమాటోగ్రఫీ, మంచి పాటలతో అందమైన కుటుంబ వాతావరణం క్రియేట్ చేశారు దర్శకుడు. క్యారెక్టర్ల ఎమోషన్స్‌లో నేచురాలిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తాయి. సినిమా ప్రారంభమైన తర్వాత కొన్ని సన్నివేశాలు, ఇంటర్వెల్ సీన్స్‌తో సినిమా కథ స్పీడ్‌గా నడుస్తున్నట్టు అనిపించినా.. కొన్ని సీన్లు ప్రేక్షకుడికి బోర్‌‌ కొట్టిస్తాయి. 

వైష్ణవ్‌ తేజ్ (Vaishnav Tej) హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా శుక్రవారం రిలీజైంది

ప్లస్ పాయింట్లు..

వైష్ణవ్‌ తేజ్ నటన, కుటుంబ నేపథ్యంలో నడిచే కొన్ని సన్నివేశాలు, పాటలు

మైనస్ పాయింట్లు..

తెలిసిన కథ, నేచురాలిటీ మిస్ అయిన ఎమోషన్స్

ఒక్క మాటలో..రొటీన్ ఫ్యామిలీ డ్రామా 

 

నటీనటులు – వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), కేతిక శర్మ, నవీన్ చంద్ర, నరేష్, ప్రభు, తులసి

దర్శకత్వం – గిరీశాయ

నిర్మాత – బీవీఎస్ఎన్ ప్రసాద్

సంగీతం – దేవి శ్రీప్రసాద్

విడుదల తేదీ ‌– 02–09–2022

రేటింగ్ – 2 / 5

Read More : 'ఇద్దరు మామలను చూస్తూ పెరిగా..' పవన్ కల్యాణ్ 'బద్రి' (Badri) రీమేక్ చేయాలని ఉంది : వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!