హీరో నిఖిల్ (Nikhil) తండ్రి కన్నుమూత
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్ధ్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ నిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలోనే మృతిచెందారు. నిఖిల్ కుటుంబాన్ని పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఉన్న సమయంలోనే తండ్రి మరణవార్త నిఖిల్‌కు తెలిసింది. విషయం తెలుసుకున్న నిఖిల్ షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు. తండ్రి మరణవార్త విని నిఖిల్ ఎమోషనల్ అయ్యారు. కాగా, సంబరం సినిమాలో నటించిన నిఖిల్‌కు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ సినిమాతో వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత యువత, స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కిర్రాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నాడు. హైదరాబాద్ నవాబ్స్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు నిఖిల్. ప్రస్తుతం కార్తికేయ 2, 18 పేజెస్, స్పై సినిమాల్లో నటిస్తున్నాడు నిఖిల్. 1985 జూన్ 1న హైదరాబాద్‌లో పుట్టిన నిఖిల్.. 2020 మే 14న పల్లవి వర్మను పెళ్లి చేసుకున్నాడు.
నిఖిల్ హీరోగా నటిస్తున్న 18 పేజెస్ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు, సుకుమార్ నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్‌ను 2021 జూన్ 1న రిలీజ్ చేశారు. సినిమాను 2022 ఫిబ్రవరి 18 వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించినా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సుకుమార్, సంగీతం గోపి సుందర్, సినిమాటోగ్రఫీ ఎ.వసంత్ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇక సినిమా డైరెక్టర్ ప్రతాప్ 2009లో సుశాంత్ హీరోగా వచ్చి హిట్ అయిన కరెంట్ సినిమాకు దర్శకత్వంతోపాటు స్క్రీన్‌ప్లే, రచయితగా, మహేష్‌బాబు వన్ నేనొక్కడినే, రంగస్థలం సినిమాలకు స్క్రీన్‌ప్లే, రచయితగా వ్యవహరించాడు. కుమారి 21ఎఫ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఆకాశవాణిలో పనిచేశాడు. తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు ప్రతాప్. 1978వ సంవత్సరం జనవరి 13న ప్రతాప్ తెలంగాణలో పుట్టాడు.