Brahmastra: ‘'బ్ర‌హ్మాస్తం’ మేకింగ్ వీడియో ఓ వండ‌ర్.. యాక్ష‌న్ సీన్లపై ఫోక‌స్ చేసిన‌ ద‌ర్శ‌కుడు అయాన్

Updated on Sep 05, 2022 10:42 AM IST
 'షంషేరా'తో తెలుగు ప్రేక్ష‌కులతో మెప్పు పొంద‌ని ర‌ణ్‌బీర్ 'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) సినిమాతో త‌న స‌త్తా చాట‌నున్నారు.
'షంషేరా'తో తెలుగు ప్రేక్ష‌కులతో మెప్పు పొంద‌ని ర‌ణ్‌బీర్ 'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) సినిమాతో త‌న స‌త్తా చాట‌నున్నారు.

Brahmastra : బాలీవుడ్ స్టార్ కపుల్ ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor), అలియా భట్ న‌టించిన 'బ్ర‌హ్మాస్తం' చిత్రం సెప్టెంబ‌ర్ 9 తేదీన‌ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ఈ సినిమాను ఎలా చిత్రీక‌రించార‌నే విజువ‌ల్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నాయి. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన 'బ్ర‌హ్మాస్త్రం' తెలుగు వ‌ర్ష‌న్‌ను ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తున్నారు. 

యాక్ష‌న్ సీన్ల్స్ అదుర్స్

'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) సినిమాను ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెలుగులో స‌మ‌ర్పిస్తున్నారు. 'షంషేరా'తో తెలుగు ప్రేక్ష‌కులతో మెప్పు పొంద‌ని ర‌ణ్‌బీర్ ఈ సినిమాతో త‌న స‌త్తా చాట‌నున్నారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్, ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ద‌ర్శ‌కుడు అయాన్ డైరెక్ష‌న్‌లో యాక్ష‌న్ సీన్ల‌ను ఎలా చిత్రీక‌రించారో మేక‌ర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ర‌ణ్‌బీర్, అలియా, నాగార్జున‌, మౌనిరాయ్ స‌న్నివేశాల‌కు సంబంధించిన షూటింగ్ అద్భుతంగా సాగింది. అస్త్రాల వీరుల సాహ‌సాలు చిత్రీక‌ర‌ణ‌కు గ్రాఫిక్ విజువ‌ల్స్‌ను జోడించారు. ఇక వెండితెర‌పై వండ‌ర్‌ విజువ‌ల్స్‌తో ఈ సినిమా రిలీజ్ కానుంది. 

పురావస్తు శాఖ నిపుణుడు అజయ్‌ విశిష్ఠ్‌ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ అరవింద్‌ చతుర్వేది పాత్రలో అమితాబ్‌ బచ్చన్ న‌టించారు. విల‌న్ దమయంతి పాత్ర‌లో మౌనీ రాయ్ న‌టించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కూడా ఓ సైంటిస్ట్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. 

భారీ బ‌డ్జెట్ సినిమా

'బ్ర‌హ్మాస్త్రం' మూడు భాగాలుగా తెర‌కెక్కుతుంది. 'బ్ర‌హ్మాస్త్రం' మొద‌టి భాగం శివ పేరుతో  హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించాయి. బ్ర‌హ్మాస్త్రం విడుద‌ల త‌రువాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 

Read More: Brahmastra : 'బ్ర‌హ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ప్రోమో విడుద‌ల‌.. అంచ‌నాలు మ‌రింత పెంచిన విజువ‌ల్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!