బోయపాటితో బాలయ్య (BalaKrishna) మరో సినిమా?

Updated on Apr 23, 2022 09:40 PM IST
బోయపాటితో బాలయ్య (BalaKrishna) మరో సినిమా?
బోయపాటితో బాలయ్య (BalaKrishna) మరో సినిమా?

నటసింహం నందమూరి బాలకృష్ణ (BalaKrishna), మాస్​ డైరెక్టర్​ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులకు పండగే.   బాక్సాఫీస్​ రికార్డుల్ని తిరగరాసే కాంబినేషన్ వీళ్లిద్దరిదీ.  ఈ కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ తిరుగులేని విజయం సాధించాయి. ముచ్చటగా మూడుసార్లు హిట్​ కొట్టి హ్యాట్రిక్​ కాంబోగా పేరొందిన బాలయ్య (BalaKrishna) –బోయపాటి (Boyapati Srinu) మరోసారి జట్టుకట్టనున్నట్లు తెలుస్తోంది.  రెండేళ్ల పాండమిక్​ని పారద్రోలేలా అఖండతో తెలుగు సినిమాకి పూర్వవైభవం తీసుకొచ్చిన ఈ కాంబో ఈసారి ఓ పొలిటికల్​ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

 అఖండ విజయంతో ఊపుమీదున్న బోయపాటి (Boyapati Srinu) ఓ పొలిటికల్​ డ్రామా స్టోరీలైన్​ వినిపించడంతో,  బాలయ్య (BalaKrishna) వెంటనే గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారని ఇక సినిమా పట్టాలెక్కడమే ఆలస్యం అని సమాచారం. ఈ సినిమాని 14 రీల్స్​ ప్లస్​ పతాకంపై రామ్​ ఆచంట, గోపీచంద్​ ఆచంట నిర్మించనున్నారట. అంతేకాదు ఈ భారీ బడ్జెట్​ మూవీని 2023లో ప్రారంభించి 2024 ఎన్నికల ముందు విడుదల చేసేలా ప్లాన్​ చేస్తోందట చిత్రబృందం. త్వరలోనే ఈ చిత్రంపై క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. మాస్​ మసాలా డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే బాలయ్య (BalaKrishna) పొలిటికల్​ పంచ్​లతో ఎలా విరుచుకుపడతాడో చూడాలి మరి. 

బాలకృష్ణ(BalaKrishna)–బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాల్లోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అఖండ పాత్రతో నటసింహం అని మరోసారి నిరూపించుకున్నారు. బాలయ్య నోట పలికించే  బోయపాటి సంభాషణలకున్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. వీరిద్దరి కాంబినేషన్​లో సినిమా రిలీజైందంటే చాలు చిన్నాపెద్దా తేడాలేకుండా అందరి నోటా కొన్నేళ్లపాటు ఆ డైలాగ్​లు వినిపిస్తూనే ఉంటాయి.

బాలయ్య(BalaKrishna) డైలాగులతో కామెడీ బిట్లు, స్పూప్​లు, మీమ్స్​, జోక్స్​ కోకొల్లలుగా పుట్టుకొస్తాయి. సినిమాని  క్లాస్​గా మొదలుపెట్టి మాస్​గా ముగించే బోయపాటి పొలిటికల్​ డ్రామాని ఎలా ముగిస్తాడో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్​ చేయాల్సిందే.

కాగా, బాలకృష్ణ (BalaKrishna) ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్​ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తవగానే సెప్టెంబర్​లో దర్శకుడు అనిల్ రావిపూడితో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. బోయపాటి కూడా ఎనర్జిటిక్​ స్టార్​ రామ్​తో ఓ పాన్​ ఇండియా సినిమా ప్లాన్​ చేస్తున్నారు. వీరిద్దరూ కమిట్​ అయిన చిత్రాలు పూర్తవగానే వీరి కాంబోలో చిత్రం ప్రారంభం కానుందని టాలీవుడ్​ టాక్​.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!