త్వరలో అషూ రెడ్డి (Ashu Reddy) ‘ఫోకస్’ ట్రైలర్

Updated on Apr 27, 2022 06:08 PM IST
అషూ రెడ్డి (Ashu Reddy) ‘ఫోకస్’ సినిమా  పోస్టర్
అషూ రెడ్డి (Ashu Reddy) ‘ఫోకస్’ సినిమా పోస్టర్

బిగ్‌బాస్‌ షో అన్ని భాషల్లోనూ పాపులర్ అయ్యింది. ప్రేక్షకుల్లో ఆదరణ ఉన్న వారిని ఎంపిక చేసి హౌస్‌లోకి పంపిస్తారు. ఆ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా అందులో పార్టిసిపేట్‌ చేసిన వాళ్ల క్రేజ్ పెరుగుతోంది. దీంతో బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న వాళ్ల కెరీర్‌‌ అభివృద్ధి చెందుతోందనే చెప్పాలి. ఇటీవల జరిగిన బిగ్‌బాస్‌ సీజన్‌లో పాల్గొన్న అషూ రెడ్డి (Ashu Reddy) సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.

బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘ఫోకస్’. యంగ్‌ హీరో విజయ్ శంకర్ హీరోగా చేస్తున్న ఈ సినిమాకు జి.సూర్య తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. సుహాసిని, మణిరత్నం, భానుచందర్‌‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. మర్డర్ మిస్టరీ కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ‘ఫోకస్‌’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రిలీజైన మూవీ టీజర్‌‌కు సోషల్‌ మీడియాలో ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి.

ఫోకస్‌ సినిమాలో అషూ రెడ్డి మొదటిసారి పోలీస్ ఆఫీసర్‌‌గా నటించింది. అషూ రెడ్డి ఫస్ట్‌ లుక్‌ను బి.సుమతి ఐపీఎస్‌ (డీఐజీ, మహిళా భద్రాతా విభాగం) విడుదల చేశారు.

త్వరలో స్టార్‌‌ హీరోతో ‘ఫోకస్’ సినిమా ట్రైలర్ లాంచ్ చేయించబోతున్నట్టు దర్శకుడు సూర్యతేజ వెల్లడించారు. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చిందని, చిత్ర యూనిట్‌ అంతా దానిపై సంతోషంగా ఉన్నారని చెప్పారు. స్మైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఫోకస్ సినిమాను నిర్మిస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!