జాతిరత్నాలు హీరోతో అనుష్క (Anushka)?

Updated on Apr 27, 2022 10:14 PM IST
నవీన్‌ పోలిశెట్టితో అనుష్క (Anushka)
నవీన్‌ పోలిశెట్టితో అనుష్క (Anushka)

సూపర్ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన అనుష్క (Anushka) టాలీవుడ్‌ స్టార్‌‌ హీరోలందరి సరసన నటించి నంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచింది. గ్లామర్ హీరోయిన్‌గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకూ ఓకే చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించిందీ స్వీటీ. ఇక అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ‘అరుంధతి’ కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా నటన పరంగా ఆమెను మరో మెట్టు ఎక్కించింది. ఈ క్రమంలోనే మరికొన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసినా అరుంధతి రేంజ్‌లో అవి సక్సెస్‌ కాలేదనే చెప్పాలి. అయితే అనుష్కను మాత్రం స్టార్‌‌ హీరోయిన్‌ హోదాలో నిలబెట్టాయి.

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ బాక్సాఫీస్‌ దగ్గర అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయితే స్వీటీ నటన, కథలో ట్విస్ట్‌లు ప్రేక్షకులకు కిక్‌ ఇచ్చాయనే చెప్పుకోవాలి. చాలాకాలం తర్వాత చెవిటి, మూగ అమ్మాయి పాత్రలో నటిస్తూ అనుష్క చేసిన ‘నిశ్శబ్దం’ సినిమా నిరాశపరిచింది. ఓటీటీలో నేరుగా రిలీజైన ఈ సినిమాకు నెగెటివ్‌ మార్కులే పడ్డాయి. అప్పటి నుంచి వెండితెరపై కనిపించని అనుష్క తెలుగులో మరో సినిమాకు ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనుష్క ఓకే చేసింది జాతిరత్నాలు సినిమా హీరో నవీన్‌ పోలిశెట్టి పక్కన హీరోయిన్‌గా చేయడానికి స్వీటీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

ఇటీవల ‘జాతిరత్నాలు’ సినిమాతో సూపర్‌‌హిట్‌ అందుకున్న నవీన్‌ పోలిశెట్టి మహేష్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో నవీన్‌ పక్కన అనుష్క హీరోయిన్‌గా చేయనుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాకు ‘మిస్‌ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే టైటిల్‌ని చిత్ర యూనిట్‌ రిజిస్టర్ చేసింది. అంతేకాదు ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్‌‌పై ఒక  ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇంటర్నేషనల్ చెఫ్‌గా అనుష్క కనిపించనుండగా, నవీన్‌ మాత్రం సాఫ్ట్​వేర్ ఇంజనీర్‌‌గా నటిస్తున్నాడని టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై కామెడీ జోనర్‌‌లో సినిమా తీస్తున్నారని.. నవీన్‌ కంటే పెద్ద వయసుదైనా అనుష్క తన ప్రేమను అంగీకరిస్తుందని,  అనంతరం వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని అంటోంది చిత్ర యూనిట్‌.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!