పునీత్‌ (Puneet RajKumar) పేరు టాటూ వేయించుకున్న నటి

Updated on Apr 28, 2022 06:55 PM IST
పునీత్ (Puneet RajKumar) పేరును టాటూ వేయించుకున్న నటి నమ్రత
పునీత్ (Puneet RajKumar) పేరును టాటూ వేయించుకున్న నటి నమ్రత

హీరోలకు ఉండే క్రేజే వేరు. వాళ్లు చేసే సినిమాలు, అందులో వాళ్లు చేసే క్యారెక్టర్లు హీరోల క్రేజ్‌ను మరింతగా పెంచుతాయి. అయితే కొంతమంది సెలబ్రిటీలు వాళ్లు చేసే సేవా కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతారు. అలాంటి వారిలో కన్నడ స్టార్‌‌ హీరో పునీత్‌ రాజ్‌కుమార్ కూడా ఒకరు. ఇటీవల ఆయన అకస్మాత్తుగా మరణించారు. ఆ తర్వాత మాత్రమే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు బయట ప్రపంచానికి తెలిశాయి. పునీత్‌ గొప్ప మనసు గురించి తెలుసుకున్న ఆయన అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీల్లో కూడా పునీత్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

అందరితో కలివిడిగా ఉండే పునీత్.. అన్ని ఇండస్ర్టీలకు చెందిన వారితో సన్నిహితంగా మెలిగేవారు. ముఖ్యంగా సాయం కోసం ఎవరైనా అడిగితే తప్పకుండా చేసేవాడని చాలామంది చెప్పారు కూడా. దీంతో పునీత్‌ మరణవార్త విని ఆయన పార్ధివదేహానికి నివాళులర్పించడానికి తరలివెళ్లారు. పునీత్‌ మరణించి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన లేరన్న విషయాన్ని కన్నడ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇష్టమైన వ్యక్తి పేరు, లేదా ఫోటో లేదా డిజైన్‌ను బాడీపైన టాటూ వేయించుకోవడం చాలా రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవల మరణించిన పునీత్‌ ఫోటోను ఒక యాక్టర్ తన చేతిపైన టాటూగా వేయించుకుంది. పునీత్‌ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఆయన పేరును టాటూ వేయించుకుంది నమ్రత అనే నటి. నాగిని సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి నమ్రత గౌడ పునీత్‌కు పెద్ద ఫ్యాన్. పునీత్‌ పేరు వేయించుకున్న టాటూను సోషల్‌ మీడియాలో షేర్‌‌ చేసిన నమ్రత.. ‘ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అనే కాప్షన్‌ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్‌ వైరల్ అవుతోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!