సినిమాల్లోకి ఆమని (Aamani) మేనకోడలు

Updated on Apr 27, 2022 04:33 PM IST
ఆమని (Aamani) మేనకోడలు హృతిక
ఆమని (Aamani) మేనకోడలు హృతిక

సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నా..అందులో నిలదొక్కుకుని ఎదగాలన్నా వెనకాల ఎవరో ఒకరి అండదండలు ఉండాలి. అలాగని అండదండలు ఉన్నంత మాత్రాన అందరూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకోలేరు, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాంటే ఎవరో ఒకరి సహకారంతో పాటు అందం, అభినయం కూడా ముఖ్యమే. అలాంటి అందం, అభినయం ఉన్న హీరోయిన్‌ ఆమని(Aamani). మావిచిగురు, శుభలగ్నం, మిస్టర్ పెళ్లాం సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే,  హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో సినిమాలకు దూరమయ్యారు. ఈ మధ్య తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ నలుగురు సినిమాలో రాజేంద్రప్రసాద్‌కు భార్యగా చేసిన క్యారెక్టర్‌‌కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకున్నా అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు.

వారసత్వంగా సినిమా ఇండస్ట్రీలోకి రావడం షరా మామూలే. అయితే హీరోల కొడుకులో, హీరోయిన్ల కొడుకులు, కూతుర్లు రావడమే ఇప్పటి వరకు మనం ఎక్కువగా చూశాం. అయితే ఇప్పుడు ఆమని మేనకోడలు హృతిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలనటిగా 3 సినిమాల్లో నటించిన హృతిక హీరోయిన్‌గా నటిస్తోంది.

అభిలాష్‌ భండారి హీరోగా తెరకెక్కుతున్న ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది హృతిక. చక్ర ఇన్ఫోటైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటరత్నం నిర్మాణంలో, జీవీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌‌ బుధవారం విడుదలైంది. లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ‘నారి నారి నడుమ మురారి’ సినిమా రెగ్యులర్‌‌ షూటింగ్‌ జూన్‌ నుంచి ప్రారంభమవుతుంది.

యానాం, అమలాపురం, విశాఖపట్టణం, లంబసింగి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. సింధు కే ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి జె.ప్రభాకర్‌‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఆమని (Aamani) నటవారసురాలిగా వస్తున్న హృతిక ఎలా యాక్ట్‌ చేస్తుందో చూడాలి మరి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!