త్వ‌ర‌లో అన్ స్టాప‌బుల్2 (UnStoppable2) షో.. తొలి ఎపిసోడ్ కు రాబోతున్న స్టార్ ఎవ‌రంటే?

Updated on Apr 30, 2022 02:18 PM IST
Unstoppable Show With NBK (అన్ స్టాప‌బుల్ 2)
Unstoppable Show With NBK (అన్ స్టాప‌బుల్ 2)

తెలుగు ఓటీటీ ఆహా కోసం నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Blakrishna) హోస్ట్ గా చేసిన టాక్ షో ''అన్ స్టాపబుల్ షో 2'' (Unstoppable Show). తొలుత‌ ఇది విన్న ఆయ‌న అభిమానులు బాలయ్య ఏంటి? హోస్ట్ గా చేయడం ఏంటి? అనే ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. అంత‌కేకాకుండా ఒక షోకు హోస్ట్ గా చేయ‌డం అసలు బాల‌య్య వల్ల‌ సాధ్యం అవుతుంది? ఒకవేళ ఆ షో చేసినా జనాలు ఆదరిస్తారా ? అనే సవాలక్ష అనుమానాలు మొద‌ల‌య్యాయి. కానీ బాలయ్య ఆ షో మొద‌లు పెట్టాక‌ తన వాక్చాతుర్యంతో అభిమానులు, ప్రేక్ష‌కుల‌ అనుమానాలను పటాపంచలు చేశారు. అంతేకాకుండా తన షోని ఐఎండీబీ (IMDB) లిస్టులో యావత్ భారతదేశంలోనే నెంబర్ వ‌న్ షోగా నిలబెట్టాడు.  

ఇక, ఈ అన్ స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షో మొద‌లు పెట్టిన‌ప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. నిర్మాత ఆహా (Aha) అధినేత అల్లు అర‌వింద్ సైతం డిఫ‌రెంట్ ఏదో ఒక షో చేయాల‌ని దీనికి పూనుకున్నాడు. అయితే బాల‌య్య త‌న పాపులారిటీతో, త‌న ఆహార్యంతో షో ను ఇంత పెద్ద హిట్ చేశారు. దీంతో ఈ షో భార‌త‌దేశంలో నెంబ‌ర్ వ‌న్ షో గా రికార్డులు సృష్టిస్తోంది. 

ఈ నేప‌థ్యంలోనే ఈ టాక్ షో కు.. సీజన్ 2 రూపొందించేలా సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. తొలి సీజన్ కి త‌ల‌ద‌న్నేలా.. సీజన్ 2 ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీజన్ 2 రెడీ  అవుతున్న‌ట్లు స‌మాచారం బ‌య‌టికి రాగానే ఈ సీజన్ లో ఏ స్టార్ హీరోలు హాజరు కానున్నారు? ప్రారంభ ఎపిసోడ్ కు ఎవ‌రు రాబోతున్నార‌నే కుతూహలం అందరిలో పెరిగిపోయింది. అది స‌హ‌జమే కూడా. ఈ క్ర‌మంలో ఇంతవరకూ ఈ షో కు హాజ‌రు కాని మెగాస్టార్ చిరంజీవి.. విక్ట‌రీ వెంకటేశ్.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో ముందుగా చిరంజీవి పేరునే క‌న్ఫామ్ చేయాల‌ని ఆహా టీమ్ ఆలోచిస్తోంద‌ట‌. అయితే.. త్వరలో మిగతా స్టార్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కొత్తదనం పేరుతో సీజన్ 2లో ఎలాంటి అంశాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి!

అయితే, మొదటి నుంచీ బాలకృష్ణ రూటే స‌ప‌రేటు. ఏదైనా కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయాల‌నుకుంటే.. వెన‌క‌డుగు వేయరు. త‌ప్ప‌కుండా పూర్తి చేసి తీరుతారు. కాగా, తోటి స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున కు ఆల్రెడీ ఇంతుకుముందు ప‌లు షోల‌కు హోస్టుగా చేసిన అనుభ‌వం ఉంది. చిరంజీవి.. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షో కు, నాగార్జున కూడా చిరంజీవి కంటే ముందు అదే షో కు హోస్టు గా చేశాడు. ప్ర‌స్తుతం నాలుగు సీజ‌న్లుగా బిగ్ బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

కాగా, సీజన్ 1 లో మోహన్ బాబు తో స్టార్ట్ చేసి కీరవాణి, రవితేజ, బ్రహ్మానందం, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి, పూరీ జగన్నాథ్, సుకుమార్, బోయ‌పాటి శ్రీను, అనిల్ రావిపూడి, వంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌ను బాల‌య్య‌ ఇంటర్వ్యూ చేసారు. అయితే, బాలయ్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో ఆహాలో ఈ షో ను నిర్వహించనున్నారట. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!