తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ (Telugu Indian Idol) స్పెషల్ గెస్ట్ గా రానున్న మ‌ణిశ‌ర్మ‌

Updated on May 05, 2022 08:43 PM IST
మ‌ణిశ‌ర్మ‌ (Manisharma as Chief Guest)
మ‌ణిశ‌ర్మ‌ (Manisharma as Chief Guest)

తెలుగులో తొలిసారిగా డిజిటల్ రంగంలో ప్రారంభ‌మైన సంస్థ‌ ఆహా ఓటీటీ. ఎల్ల‌ప్పుడూ ఆహా అనిపించే షోస్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. వంద శాతం తెలుగు కంటెంట్ తో ఓటీటీ  దూసుకుపోతోంది ఆహా(Aha OTT). సూపర్ హిట్ సినిమాలను, ఆకట్టుకునే వెబ్ సిరీస్ (Web Series) లను.. అలరించే గేమ్ షోలను అందిస్తుంది ఆహా. డిఫ‌రెంట్ కంటెంట్ తో అందరినీ అలరిస్తూనే వస్తుంది. 

మరో వైపు ఇతర భాషల్లోనూ సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ వినోదాన్ని పంచుతోంది ఆహా. ఈ క్రమంలోనే  ఈవారం సరికొత్త సినిమాలను అందించడానికి రెడీ అయ్యింది ఆహా. ఈ మండుతున్న ఎండలలో, తనవంతు చల్లదనాన్ని అందించడానికి ఈ వారం మ‌ల‌యాళం హీరో ఫహద్ ఫాసిల్ నటించిన సినిమాని తెలుగు లో 'దొంగాట' పేరితో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ చేయగా చేయనున్నారు. 

మ‌రోవైపు.. తెలుగు రియాలిటీ షో ఇండియన్ ఐడల్​లో ఈ వారం స్పెషల్​ గెస్ట్ గా సెన్సేష‌న‌ల‌ మ్యూజిక్​ డైరెక్టర్ మణిశర్మ సంద‌డి చేయ‌నున్నారు. సింగ‌ర్ శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేయ‌నున్న ఈ షో ఫ్యామిలీ ఎపిసోడ్​లో ఆయ‌న కనిపించనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. అందులో ​మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు పాడి ఆయనకు వెల్​కం చెప్పారు కంటెస్టెంట్స్​. ఈ షోకు జడ్జిల్లో ఒకరైన ఎస్ఎస్ థ‌మన్, మణిశర్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ స్పెషల్​ ఎపిసోడ్​ శుక్ర, శనివారాల్లో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!