బిగ్ బాస్ ఓటీటీ (Biggboss OTT) లో ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ గెలుచుకున్న‌ది ఎవరంటే..?

Updated on May 07, 2022 08:23 PM IST
బాబా భాస్క‌ర్ (Baba Bhaskar)
బాబా భాస్క‌ర్ (Baba Bhaskar)

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ప్ర‌సార‌మవుతున్న‌ బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) షో ప్ర‌స్తుతం చివ‌రికి వ‌చ్చేసింది. త్వ‌ర‌లో గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో హౌస్ లో రోజురోజుకు ఇంటి స‌భ్యులందరూ విభిన్న రకాల హావభావాలతో వారి బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దారుణంగా ఫెయిల్ అవుతుండ‌గా.. మ‌రికొంద‌రు రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్‌ యాంకర్‌ శివ (Anchor Shiva) నెత్తిన దరిద్రం తాండవం చేస్తోంది. అందుకే ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ పోటీదారుడిగా నిలిచేందుకు ఎంత పోరాడిని ఫలితం వచ్చినట్లే వచ్చి చేజారుతోంది. ఇక చివ‌ర‌గా ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం అఖిల్‌, అనిల్‌, బాబా, బిందు మాధవి పోటీపడ్డారు. వీరిలో హౌస్ లో మోస్ట్ ఎంట‌ర్టైన‌ర్ అయిన‌ బాబా భాస్కర్‌ పాస్‌ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ను బాబా ఎవరికోసమైనా ఉపయోగిస్తాడా లేక‌.. త‌నే ఉప‌యోగించుకుంటాడా అన్న‌ది ఆసక్తికరంగా మారింది. 

ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది మాత్రమే మిగిలి ఉన్నారు. అయితే చివరి వారంలో ఎలిమినేషన్ అయితే ఉండదు కాబ‌ట్టి.. మిగిలిన రెండు వారాల్లో టాప్ ఫైవ్ లో కి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఈ వారం ఎవరు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ వారం డబుల్ ఎలిమినేట్ చేసి ఆ తర్వాత మరుసటి వారం సింగిల్ ఎలిమినేషన్ ఉండనున్న‌ట్లు తెలుస్తోంది. లేదంటే షో మధ్యలోనే మరొకరిని బ‌య‌ట‌కు పంపించవచ్చని కూడా వార్త‌లు వస్తున్నాయి. అయితే.. ఈ వార‌మే ఇద్దరిని ఎలిమినేట్ చేయవచ్చనే టాక్ వచ్చిన నేప‌థ్యంలో.. ప్ర‌స్తుతం ఆ స్థాయిలో రిస్క్ చేయకూడదని బిగ్ బాస్ భావించి మళ్లీ వెనుకడుగు వేసినట్లు సమాచారం. మ‌రో సమాచారం ప్ర‌కారం  ఈసారి నాన్ స్టాప్ తొలి సీజన్ లో భాగంగా ఎన్న‌డూ లేనివిధంగా సరికొత్తగా టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ తో ఫైనల్ ఎపిసోడ్ ను కొనసాగిస్తార‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ వారం యాంకర్ శివ, అరియానా, అషు రెడ్డి మిత్రశర్మ, బిందుమాధవి, అనిల్ రాథోడ్ ఇలా ఏడుగురు  నామినేషన్స్ లో ఉన్నారు. ఈ ఏడుగురు లో బిందుమాధవి, యాంకర్ శివ, సేఫ్ అని తెలుస్తోంది. ఓట్ల ప‌రంగా అయితే అఖిల్ మళ్లీ టాప్ లో ఉండగా.. బిందుమాధవి రెండో స్థానంలో పోటీ గా ఉంది. ఆ తర్వాత వ‌రుస‌గా యాంకర్ శివ, మిత్రశర్మ, అరియానా, అనిల్ రాథోడ్ ఉన్నారు. దీంతో ఫైనల్ గా ఈ వారం అషు రెడ్డి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆడియన్స్ సపోర్ట్ కోల్పోవడంతోనే ఆమెకి ఈ వారం భారీగా ఓట్లు తగ్గినట్లు తెలుస్తోంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!