సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) కు హీరోగా ఛాన్స్.. చివరికి ఏమైందంటే?
తెలుగు బుల్లితెరపై కమెడియన్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈటీవీ లో ప్రసారమయ్యే కామెడీ షో ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో (Extra Jabardasth) ఎంతమంది కమెడియన్లు ఉన్నా.. సుడిగాలి సుధీర్ ఉన్నాడంటే ఆ కిక్కే వేరు. సూపర్ కమెడియన్ గా, హీరోగా, యాంకర్ గా తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు సుధీర్.
మెజీషియన్ గా, డాన్సర్ గా, హీరోగా ఇలా అన్నిరంగాలలో కూడా తనదైన సత్తా చాటుతూ ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇక యాంకర్ రష్మితో (Rashmi) జతకలిశాడంటే రచ్చ రచ్చే ఉంటుంది. బయట ఏదైనా ఈవెంట్ లో సుధీర్ కనిపించాడంటే చాలు.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. సుధీర్ కి అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక, ఈటీవీలో ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ చూసేవారిలో చాలామంది కేవలం సుడిగాలి సుధీర్ స్కిట్స్ కోసమే చూసే వాళ్ళు ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే.. ఆయన జబర్దస్త్ లో తన స్కిట్స్ లలో ఎక్కువగా అమ్మాయిలు, ఆంటీల వెంట పడే జులాయిలా ఉంటాయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆయనను ఎక్కువగా శృంగార ప్రియుడిగా చూపిస్తారు. అభిమానులను నవ్వించడం కోసం తనను తానే తగ్గించుకుంటూ తోటి ఆర్టిస్టులతో పంచులు వేయించుకుంటాడు సుడిగాలి సుధీర్. ఫాన్స్ ను ఎంటర్టైన్ చేయడం కోసం ఏమైనా చేస్తానంటూ సుధీర్ పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా సుధీర్ చేసిన ఓ స్కిట్ హిలేరియస్ గా ఉంది. అందులో సుధీర్ సినిమా అవకాశాలు వచ్చిన హీరో క్యారెక్టర్ నవ్వులు పూయించాడు. ఈ స్కిట్ లో సైతం తోటి నటులు సుధీర్ పై పంచుల వర్షం కురిపించారు. రాంప్రసాద్, ఇమ్మాన్యుయేల్ మరికొందరు కమెడియన్లు కలిసి ఓ స్కిట్ చేశారు. అందులో భాగంగా ఇమ్మాన్యుయేల్ సుధీర్ తో సినిమా చేయడానికి ఓ స్టోరీ లైన్ చెప్పడానికి సిద్దమవుతాడు.
కానీ, ఆ లైన్ సుధీర్ కు నచ్చకపోవడంతో తానే ఓ లైన్ చెప్తాడు. స్కిట్ లో భాగంగా తన పెర్ఫామెన్స్ నచ్చిన ఢీ షోలని జడ్జి పూర్ణ వచ్చి తన బుగ్గ కొరకుతుందని లేదా తానే వెళ్లి ఆమె బుగ్గ కొరుకుతానని చెప్తూ.. తాను ఇప్పటి వరకు స్టోరీ లైన్ చెప్పిన మూడు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయని చెప్తుండగానే సుధీర్ కు ఫోన్ వస్తుంది. ఫోన్ లో అటు వైపు నుంచి ఓ వ్యక్తికి తాను ఇప్పటివరకు నటించిన గాలోడు, కాలింగ్ సహస్ర వంటి సినిమాలు మంచి హిట్ తో దూసుకెళ్తున్నాయని చెప్పగానే.. పక్కనే ఉన్న ఆర్టిస్ట్, సినిమా కాదు గానీ.. సినిమానే బాగాలేదని చెప్తాడు.
ఇక్కడ (జబర్దస్త్) ఉంటే కెరీర్ సరిగా ఉండదని.. సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని సుధీర్, రాంప్రసాద్ ఇద్దరూ ఓ నిర్ణయానికి వస్తారు. ఇంతలో గిర్రున ఏడాది తిరుగుతుంది. కానీ ఇండస్ట్రీలో ఎటువంటి అవకాశాలు దొరకక.. ఒకరు సోడా బండి, మరొకరు మొక్కజొన్న పొత్తుల బండి పెట్టుకొని జీవనం సాగిస్తుంటారు. దీంతో స్కిట్ కు శుభం కార్డు పడుతుంది. కాగా, ఈ స్కిట్ లో రాంప్రసాద్, ఇమ్మాన్యుయేల్, సుధీర్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలకు పగలబడి నవ్వాల్సిందే.