జ‌బ‌ర్ద‌స్త్ కు (Jabardasth) గుడ్ బై చెప్ప‌నున్న‌ హైప‌ర్ ఆది.. నాగ‌బాబు భ‌లే స్కెచ్ వేశాడుగా!

Updated on May 02, 2022 09:38 PM IST
హైప‌ర్ ఆది (Hyper Adi)
హైప‌ర్ ఆది (Hyper Adi)

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది అనామ‌కుల‌కు జీవితాన్ని ఇచ్చింది. ఎంతోమంది క‌మెడియ‌న్లు ఈ షో ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నారు. సుడిగాలి సుధీర్, గెట‌ప్ శ్రీను, హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ వంటి వారు ఆ లిస్టులో ఉన్నారు. 

అయితే, సినిమా అవ‌కాశాలు వ‌చ్చాక జ‌బ‌ర్ద‌స్త్ ను వీడిన వారు కొంద‌రు ఉన్నారు. మ‌రికొంత‌మంది వేరే ఛానెళ్ల‌లోని షో ల‌కు షిఫ్ట్ అయిన వారు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. హైపర్ ఆది.. జబర్దస్త్ ను మాత్రమే కాకుండా మల్లెమాల వారిని కూడా పూర్తిగా వదిలేసారంటూ సమాచారం అందుతోంది. 

కాగా, జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో ఆది కూడా ఒకరు. తొలుత‌ అదిరే అభి టీం లో కంటెస్టెంట్ గా ఉన్న ఆది అనంత‌రం తన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టీమ్ లీడర్ స్థానానికి చేరుకున్నాడు. అయితే ఈ క‌మెడియ‌న్ జబర్దస్త్ కి వచ్చిన తర్వాత ఆ షో రూపు రేఖలే మారిపోయాయి. అయితే, తాజాగా ఆది జ‌బ‌ర్ద‌స్త్ లో రెమ్యునరేషన్ ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో మల్లెమాల వారు దానికి అంగీకరించలేదని తెలుస్తోంది. అందుకే ఆది గత నెల రోజులుగా ఈ షో లో కనిపించలేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. మ‌రి, ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

ఇక‌, హైపర్ ఆది జబర్దస్త్ మానేశాడు అని తెలియ‌గానే మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా ఆయనతో మాట్లాడిన‌ట్లు స‌మాచారం అందుతోంది. స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, నాగ‌బాబు ఆ షో లో జ‌డ్జిగా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే నాగ‌బాబు చేస్తున్న‌ ఆ ప్రయత్నం వర్కవుట్ అయ్యే దిశగా కనిపిస్తుంది. 

ఇదే జ‌రిగితే మ‌ల్లెమాల టీమ్, జ‌బ‌ర్ద‌స్త్ కు ఇది పెద్ద ఎదురు దెబ్బే అని చెప్ప‌వ‌చ్చు. ఒక‌వేళ ఇదే గ‌నుక జ‌రిగితే.. ఇక నుంచి హైపర్ ఆది పేరు ఆదిగా మాత్రమే ఉండనుంది. ఆయన జ‌బ‌ర్ద‌స్త్ లో టీమ్ లీడ‌ర్ అయ్యాక అత‌ని పేరు ముందు హైపర్ అనే పదాన్ని మల్లెమాల వారే పెట్టారు. ఈ విష‌యంలో ఈటీవీ కి కాపీరైట్ ఉంటుంది. దీంతో హైపర్ పదాన్ని ఆది ఇక నుంచి ఉపయోగించడానికి వీలు ఉండదు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!