తెల్లని బట్టల్లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోతున్న (Jabardasth) జబర్ధస్త్ బ్యూటీ.. ఫొటోలు వైర‌ల్!

Updated on May 11, 2022 10:54 PM IST
జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)
జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)

పున్నమి రాత్రి చందమామలా మెరిసిపోతుంది (Jabardasth) జబర్దస్త్ వర్ష. ఈ బుల్లితెర సెలబ్రిటీ తెల్లని దుస్తుల్లో దేవకన్యలా కనిపిస్తోంది. వెన్నెలను మింగేసిందా లేక మబ్బులతో స్నానం చేసినట్లుందా? అన్నట్లు మెరిసిపోతున్న ఆమె తన గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. బుల్లితెర‌పై ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే జబర్దస్త్ షోతో పాటు పలు స్పెషల్ టెలివిజన్ కార్యక్రమాలలో వర్ష (Varsha) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

ప‌లు ఈవెంట్ల‌లో ఆమె మాటతీరు, ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తూ వ‌స్తోంది. కెరీర్ తొలినాళ్ల‌లో సీరియల్ నటిగా.. పలు సీరియల్స్‌లో నటించినా ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో ఈటీవీలో మోస్ట్ పాపులర్ కామెడీ షో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే తన గ్లామర్‌తో ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది వర్ష. సన్నజాజి తీగ లాంటి నడుముతో.. ఈ పొడుగు సుందరి ఎవరా అంటూ జబర్దస్త్ ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ షోలోని కామెడీ స్కిట్స్‌లో ఈ బ్యూటీ గ్లామర్ హైలైట్ కాగా, సరికొత్త అనుభూతిని ఆమె ప్రేక్షకులకు పంచుతున్నారు. 

జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)

ఆ మ‌ధ్య‌ కొన్నాళ్ళు జబర్ధస్త్ (Jabardasth) వేదికపై వర్ష కనిపించలేదు. దీనికి కార‌ణం.. ఇమ్మానియేల్‌తో ఆమె చేస్తున్న స్కిట్స్‌‌ను ఉద్దేశించి, ప్రేక్ష‌కులు యూట్యూబ్‌లో వల్గర్ కామెంట్స్ చేస్తున్నారట. "ఏమిటక్కా ఇది.." అంటూ వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. దీంతో ఈ విషయాన్ని కాస్త‌ జబర్దస్త్ వేదికపైనే చెప్పేసిందామె. అలాగే "జబర్దస్త్ మానేస్తున్నాను" అని ప్ర‌క‌టించింది కూడా. చెప్పిన‌ విధంగానే నిజంగానే కొన్నాళ్ళు ఆమె జబర్దస్త్‌కి దూరమైంది. ఆ త‌ర్వాత మరలా ఇదే షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే ప్రసారమైన ఓ స్పెషల్ ఈవెంట్‌లో ఇమ్మానియేల్ ఆమెను బాధపెట్టే మాటలు అనడంతో, ఆమె ఫీల్ అయ్యింది. స్కిట్‌లో భాగంగా వ‌ర్ష‌ను లేడీ గెటప్ అనడంతో ఆమె సీరియస్ అయింది. దీంతో పాటు ఈవెంట్ నుండి బ‌య‌టికి వెళ్లిపోయింది. ఈ విషయంలో వర్ష, ఇమ్మానియేల్ ప‌ర‌స్ప‌రం గొడవపడ్డారు. అయితే, ఆ త‌ర్వాత‌ మరలా వీరిద్దరూ కలిసి స్కిట్స్ చేస్తున్నారు. 

జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)

 వర్షకు (Varsha) బుల్లితెరపై మంచి భవిష్యత్తు ఉందనే అనిపిస్తోంది. ఆమె స్టార్ యాంకర్ గా, బుల్లితెర ఆర్టిస్ట్‌గా ఎదిగే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. దానికి ఆమె ఫాలోయింగ్ కూడా కారణం. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్ కేటగిరీలో ఈ భామ‌కు టాప్ టెన్‌లో సైతం చోటు దక్కింది. ఆ జాబితాలో వ‌ర్ష‌కు ఆరవ స్థానం లభించింది. దీన్ని బట్టి ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్ర‌మంలో తాజాగా ఆమె షేర్ చేసిన‌ ఫొటోల్లో సన్నటి నడుముతో.. ఈ జబర్దస్త్ సుందరి వర్ష మామిడి తోటలో ఒంటరిగా కనిపించింది. ఆ ఫొటోల్లో  లంగా జాకెట్ ధరించి మరీ గ్లామర్ విందు చేసింది. ప‌చ్చని చెట్ల మధ్య నెమలి పిల్లలా ఉన్న జబర్దస్త్ వర్షను చూసిన ఫ్యాన్స్.. సో క్యూట్ అంటూ మనసు కూడా పారేసుకుంటున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!