ప్ర‌పంచ నృత్య దినోత్స‌వం (International Dance Day) స్పెష‌ల్ ప్రోగ్రాం.. ప్రోమో వైర‌ల్!

Updated on Apr 29, 2022 02:21 PM IST
International Dance Day
International Dance Day

తెలుగు బుల్లితెర‌పై ఈటీవీ ఓ సంచ‌ల‌నం. తెలుగు రాష్ట్రాల్లోని టీవీ ఛానెళ్ల‌లో ఈటీవీకి ఎప్పుడూ ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. ప్ర‌త్యేక రోజులు, పండుగ‌ల‌కు సంబంధించి నిత్యం ఏదో ఒక సరికొత్త ప్రోగ్రాంల‌ను రూపొందిస్తుంటుంది. 

తాజాగా ప్ర‌పంచ నృత్య దినోత్స‌వం (ఏప్రిల్ 29) సంద‌ర్భంగా నా ఆట చూడు అనే పేరుతో ఓ కొత్త ఈవెంట్ కు శ్రీకారం చుట్టింది. ఈ షోకు జ‌డ్జిలుగా అల‌నాటి ప్ర‌ముఖ‌ కొరియోగ్రాఫర్లు త‌రుణ్, బృందా మాస్ట‌ర్లు వ్య‌వ‌హ‌రించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఈ ప్రోమో ఢీ షోలోని అన్ని సీజ‌న్ల‌కు సంబంధించిన డ్యాన్స‌ర్లు పాల్గొన్నారు. 

అంత‌కుముందు సీజ‌న్ల‌కు 'ఢీ' టైటిల్ విన్నింగ్ కొరియోగ్రాఫ‌ర్లైన భూష‌ణ్ మాస్ట‌ర్, య‌శ్ మాస్ట‌ర్ సైతం డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టారు. క్లాసిక‌ల్, ఫోక్, వెస్ట్ర‌న్ ఇలా అన్ని ర‌కాల న‌త్యాల‌తో డ్యాన్స‌ర్లు అద‌ర‌గొట్టారు. శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలోని 'సిరివెన్నెల' పాట‌కు చేసిన క్లాసిక్ డ్యాన్స్ అదిరిపోయింది. 

అలాగే బ‌న్నీ, పూజా హెగ్డేల 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' పాట‌కు చేసిన డ్యాన్స్ అయితే సూప‌ర్. ఇక‌, ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ గా యాంక‌ర్ ర‌ష్మి వ్య‌వ‌హ‌రించారు. ఆమెతో పాటు హైప‌ర్ ఆది, ఆటో రామ్ ప్ర‌సాద్ చేసిన కామెడీ అదుర్స్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ ప్రోగ్రాం ఫుల్ ఎపిసోడ్ ను చూసేందుకు మే 1వ తేదీ వ‌ర‌కు వేచిచూడాల్సిందే. ప్ర‌స్తుతానికైతే ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!