జ‌బ‌ర్ద‌స్త్ ను వెంటాడుతున్న క‌ష్టాలు.. రోజా బాట‌లోనే హైప‌ర్ ఆది?

Updated on May 06, 2022 03:44 PM IST
హైప‌ర్ ఆది, రోజా (Hyper Adi, Roja)
హైప‌ర్ ఆది, రోజా (Hyper Adi, Roja)

బుల్లితెరపై ప్ర‌సార‌మ‌య్యే జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయ‌న‌క్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా స‌క్సెస్ ఫుల్‌గా సాగుతోంది. క్లాస్, మాస్, పేద, ధనిక, చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా జబర్దస్త్ ఆకట్టుకుంటోంది. ఈ షో ద్వారా ఇప్పటికే ఎంతో మంది కమెడియన్లు సినీ ఇండస్ట్రీకి సైతం పరిచయం అయ్యారు. 

సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, హైపర్ ఆది, చలాకీ చంటి టీమ్స్ జబర్దస్త్ కి ఆయువుగా మారాయి. ముఖ్యంగా జబర్దస్త్ లో ఆది టీం, ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం మంచి కామెడీ పంచుతూ… చాలా మంది టీమ్ లీడర్స్ తప్పుకున్నా షోకి ఆదరణ తగ్గకుండా చేశారు. 

ఈ కామెడీ షో నుంచి మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్ కి కళ తగ్గిపోయింది. ఆ తర్వాత గెస్టు జ‌డ్జిల‌తో క‌లిసి రోజా జడ్జిగా వ్యవహరిస్తూ నెట్టుకొచ్చింది. ఇటీవ‌ల ఆమెకి మంత్రి పదవి దక్కడంతో రోజా కూడా జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసింది. ఇది షోకి పెద్ద కుదుపు అని చెప్ప‌వ‌చ్చు. ఆమె జబర్దస్త్ జడ్జిగా 9 ఏళ్లకు పైగా ప్రయాణంలో మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నారు. సెన్సాప్ ఆఫ్ హ్యూమర్, టైమింగ్ పంచెస్ ఆమెను బెస్ట్ జడ్జిగా మార్చాయి. ఇకపై రోజా జబర్దస్త్ షోలో కనిపించరు. అంతేకాకుండా జబర్దస్త్ షోలో కమెడియన్స్ కూడా అంతగా కనిపించడం లేదు.  

ఈ నేపథ్యంలో ఓ వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. జబర్దస్త్ కి ఆయువు పట్టుగా ఉన్న హైపర్ ఆది కూడా బయటికి వెళ్లిపోయినట్లు స‌మాచారం అందుతోంది. సినిమా ఆఫర్స్ కారణంగానో, కొత్త షోలో అవకాశం రావడం వలనో ఆయన జబర్దస్త్ కి దూరమయి తెలుస్తోంది. అయితే, హైపర్ ఆది లేకపోతే ప్రేక్షకులకు ఈ కామెడీ షో పట్ల మరింత ఆసక్తి తగ్గుతుందనడంలో సందేహం లేదు. మ‌రికొంత మంది ఆర్టిస్టులు షో యాజమాన్యాల నిర్మాతల ఒత్తిళ్లు, అగ్రిమెంట్స్ కి భయపడి కొనసాగుతున్నారన్న పుకార్లు కూడా ఉన్నాయి. మొత్తంగా జబర్దస్త్ రెండు షోలు పూర్వ వైభవం కోల్పోతున్నాయి. స్టార్స్ గా ఉన్నవారందరూ షోని వీడడం షోకు మైనస్ గా మారింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!