పెళ్లి పీటలెక్కిన జ‌బ‌ర్ద‌స్త్ (Jabardasth) జోడీ.. అస‌లు విష‌య‌మేంటంటే?

Updated on May 05, 2022 07:28 PM IST
జ‌బ‌ర్ద‌స్త్ రాకేష్, సుజాత (Jabardasth Couple Rakesh Sujatha)
జ‌బ‌ర్ద‌స్త్ రాకేష్, సుజాత (Jabardasth Couple Rakesh Sujatha)

బుల్లితెర‌పై ప్రతి శుక్రవారం ఎక్ స్ట్రా జబర్దస్త్ (Extra Jabardasth) కామెడీ షో ప్ర‌సార‌మవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), ఆటో రాంప్రసాద్, ఇమ్మాన్యూల్, వర్ష, రాకింగ్ రాజేష్ వంటి కమెడియన్లు తమ స్కిట్స్ ద్వారా ప్రేక్షకులను విప‌రీతంగా ఆకట్టుకుంటున్నారు. ఒకరిని మించి ఒకరు స్కిట్స్ లో త‌మ కామెడీతో ముందుకు వస్తున్నారు. అయితే, ఈ శుక్రవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుద‌ల చేశారు.

తాజాగా విడుద‌లైన‌ ఈ ప్రోమో (Promo) ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ గా మారింది. ఇమ్మాన్యూల్ ఈ సారి కేజీఎఫ్ 2 పేరడీతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ స్కిట్ లో ఇమ్మాన్యూల్ రాఖీ భాయ్ గా నటించగా.. అధీర పాత్రలో బుల్లెట్ భాస్కర్ గెటప్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇమ్మాన్యూల్ కెజిఎఫ్ 2 ని తనదైన శైలిలో కూనీ చేసి నవ్వులు పూయించాడ. ఇందులో హీరోయిన్ గా వర్ష కనిపించింది. 

ఇక‌, స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ గెటప్ చూసిన ఇమ్మాన్యుల్.. నువ్వెవరో నాకు తెలుసు.. రాకేష్ మాస్టర్ కదా.. అంటూ నవ్వులు పూయించాడు. ఇక‌, మ‌రో స్కిట్ లో నూకరాజు అండ్ గ్యాంగ్ దేవకన్యల స్కిట్ తో ముందుకు రాగా.. ఆ స్కిట్ లో కూడా మంచి హాస్యం పండింది. అనంత‌రం సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ విభిన్నమైన స్కిట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. గెట‌ప్ శ్రీనుకు బ‌దులుగా ఈ సారి ఆటో రాంప్రసాద్ లేడీ గెటప్ కామెడీగా ఉంది. 

లేడీ గెటప్ లో హీరోయిన్ ఇంద్రజ లాగా డైలాగులు కొట్టిన రాంప్ర‌సాద్... శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంను పేరడీ చేశారు. ఇందులో భాగంగా జడ్జిగా వచ్చిన పూర్ణ.. సుధీర్ ను చాలా స్మార్ట్ గా ఉన్నాడని పొగుడుతుంది. దీంతో పక్కనే ఉన్న రష్మీ క్యారెక్ట‌ర్ అసూయ పడుతూ కనిపిస్తుంది. అయితే, ఈ ప్రోమోలో బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే.. జబర్దస్త్ లవ్ జోడిగా ఉన్న మరో జంట రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ ఫేమ్ సుజాత షోలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. వాళ్లిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. కాగా, ఈ విషయాన్ని వాళ్ళు కూడా ప్రకటించారు. 

అయితే, స్కిట్ లో వీరిద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వధూవరులుగా వెలిగిపోయారు. రాకేష్ సుజాతకి రింగ్ తొడుగుతున్న‌ దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి. నిశ్చితార్థం తరహాలో రింగు తొడిగిన రాకేష్.. చివ‌ర్లో సుజాతతో నీ పెళ్లి అయిపోయిందిగా.. అని చెప్పడం కొంత‌ గందరగోళానికి దారి తీసింది. 'స్పెషల్ మూమెంట్స్​ ఆన్​ స్టేజ్'​ పేరుతో ఈ పెళ్లికి సంబంధించిన దృశ్యాలను.. షోకు సంబంధించిన తాజా ప్రోమోలో చూపించారు. "నీకు కన్నీళ్లు రావని చెప్పను. కష్టాలు రావని చెప్పను. కానీ ఆ రెండు వచ్చినప్పుడు తప్పకుండా నీ పక్కన ఉంటాను." అని సుజాతతో రాకేశ్​ చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. అయితే షో కోసమే ఈ వివాహం చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ అంశంపై ఫుల్ ఎపిసోడ్ లో పూర్తి క్లారిటీ వచ్చే అవ‌కాశ‌ముంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!