BiggBoss Season6: త్వ‌ర‌లో బిగ్ బాస్ సీజ‌న్ 6.. ఈ సారి సామాన్యుల‌కు అవ‌కాశం!

Updated on May 26, 2022 07:30 PM IST
బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్రోమోలో నాగార్జున (BiggBoss Season 6 Promo)

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో మెచ్చే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ (Biggboss). ఈ షో వరుసగా ఐదు సీజన్లు హిట్ అయి.. తాజాగా ఆరో సీజన్‌కు రెడీ అవుతోంది. ఇటీవ‌లే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో ముగిసిన నేప‌థ్యంలో.. బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో నాన్ స్టాప్ లో షో లో పాల్గొన్న‌ యాంకర్‌ శివ, శ్రీరాపాక వంటి పలువురు కంటెస్టెంట్లు పాల్గొననున్నారంటూ ఇప్ప‌టికే ప్రచారం మొదలైంది. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈసారి కామన్‌ మ్యాన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టే అవ‌కాశం అంటూ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు మేకర్స్‌. గతంలో సీజన్-2లో సామాన్యులకు బిగ్‌‌బాస్ షోలో అవకాశం కల్పించగా.. మళ్లీ ఆ తరువాత ఛాన్స్ ఇవ్వలేదు. నాలుగేళ్ల త‌ర్వాత‌ తాజాగా బిగ్‌బాస్ సీజన్-6కు సామాన్యుల‌కు అవకాశం ఇస్తున్నట్లు షో హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈమేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. 

ఇందులో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ సీజన్‌ 6 (BiggBoss Season6)లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం.. ఇన్నాళ్లు మీరు బిగ్‌బాస్‌ షోను చూశారు, ఆనందించారు. ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు కదూ, అందుకే స్టార్‌ మా ఇస్తోంది.. ఆకాశాన్ని అందుకునే అవకాశం! వన్‌ టైం గోల్డెన్‌ ఛాన్స్‌.. టికెట్‌ టు బిగ్‌బాస్‌ సీజన్‌ 6. మరిన్ని వివరాల కోసం స్టార్‌ మా వారి వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవండి అంటూ చెప్పుకొచ్చాడు. పైన ఉన్న లింక్‌ను క్లిక్ చేసి.. పేరు, అడ్రస్, కాంటాక్ట్ నంబరు వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీ గురించి ఆసక్తికర విషయాలను ఎంటర్ చేయాలి. అంతేకాకుండా మీ టాలెంట్‌కు సంబంధించి ఓ వీడియోను తీసి అప్‌లోడ్ చేయాలి. ఈ వీడియో 3 నిమిషాలు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే రిజెక్ట్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. starmaa.startv.com లింక్ క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకుని.. బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు రెడీ అయిపోయిండి.

ఇదిలా ఉంటే.. సెలబ్రిటీలు అంతా ఒకచోట చేరి వారు చెప్పుకునే ముచ్చట్లు.. గొడవలతోపాటు వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది..? ఎలా ఈ స్థాయికి వచ్చారు..? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు క్యూరియాసిటీ చూపిస్తుంటారు. అందుకే బిగ్‌బాస్ షోపై (BiggBoss Season6) ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఆ షోను ఆదరించేందుకు అభిమానులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు సామాన్యులు కూడా పాల్గొనేందుకు షో నిర్వాహకులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!