పుట్టిన‌రోజు వేడుక‌ల్లో ఎంజాయ్ చేస్తున్న‌ (Anchor Sreemukhi) యాంక‌ర్ శ్రీముఖి.. ఫొటోలు వైర‌ల్!

Updated on May 11, 2022 07:54 PM IST
శ్రీముఖి పుట్టినరోజు వేడుక‌లు (Anchor Sreemukhi Birthday Party)
శ్రీముఖి పుట్టినరోజు వేడుక‌లు (Anchor Sreemukhi Birthday Party)

బుల్లితెర రాములమ్మ అయిన‌ శ్రీముఖి (Anchor Sreemukhi) పుట్టినరోజు నేడు. హుషారుకు చిరునామా అయిన ఈ బ్యూటీ ఈటీవీలో ప్ర‌సార‌మైన‌ ‘పటాస్’ కామెడీ షోతో తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కు దగ్గరైంది. సోమవారం అర్ద‌రాత్రి ఈ బ్యూటీ పుట్టిన‌రోజు సెలబ్రేషన్స్ జరిగాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీముఖి. 

శ్రీముఖి (Anchor Sreemukhi)  ఈ షోతోనే బుల్లి తెర రాములమ్మగా పేరొంది.. తనకంటూ ఓ ప్రత్యేకమైన‌ గుర్తింపును తెచ్చుకుంది. బుల్లితెర‌పైనే కాకుండా.. సినిమాల్లోనూ తనకు వచ్చిన అవకాశాలను సైతం సద్వినియోగం చేసుకుంటోంది. కెరీర్ తొలినాళ్ల‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’ సినిమాలో ఆయ‌న‌ చెల్లెలు పాత్ర పోషించిన శ్రీముఖి అప్పటి నుంచి ఏదో ఒక సినిమాలో కనిపిస్తూనే ఉంది. అటు బుల్లితెరపై పలు షోలతో నవ్వులూ పూయిస్తూనే.. మరోవైపు ఆ మ‌ధ్య‌ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో మెరిసింది. కాగా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను జ‌రుపుకుంది ఈ బ్యూటీ. దానికి సంబంధించిన ఫొటోలను త‌న‌ ఇన్ స్టాగ్రామ్ వేదికన పంచుకుంది. ఈ ఫొటోల్లో శ్రీముఖి (Anchor Sreemukhi)  తన బంధుమిత్రుల‌ మధ్య కేక్ కట్ చేస్తూ.. ఈ ఏడాదితో 29వ ఏట అడుగెడుతున్నట్టు తెలిపింది. ఈ సంద‌ర్భంగా తన సన్నిహితులు, తన సోదరుడు, అమ్మ, స్నేహితులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. అందులో భాగంగానే తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఫొటోలతో పాటు ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. అందులో మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ (Acharya) సినిమాలోని ‘భలే భలే బంజారా’ సాంగ్ కు మాస్ స్టెప్పులేసి ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చింది. ఇదిలాఉంటే.. శ్రీముఖి చిరు అప్ కమింగ్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!