ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా (Aha)లో అలరించబోతున్న అడివి శేష్‌(Adivi Sesh) , శోభిత ధూళిపాళ

Updated on May 25, 2022 02:04 PM IST
ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్‌‌2, తెలుగు ఇండియన్ ఐడల్
ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్‌‌2, తెలుగు ఇండియన్ ఐడల్

తెలుగు లోగిళ్లలో కొత్త కొత్త షోలు, కార్యక్రమాలతో అలరిస్తోంది ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’ (Aha). వారం వారం ప్రసారమయ్యే కార్యక్రమాలకు సెలబ్రిటీలను తీసుకువచ్చి ప్రేక్షకులను మరింతగా అలరించడానికి ఎప్పుడూ తమ వంతు కృషి చేస్తోంది ఆహా. ఈ వారం కూడా అదే జోష్‌ను మన ముందుకు తీసుకువస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్, సర్కార్‌‌ 2 షోలతో ఆహా సబ్‌స్క్రైబర్లకు మరింత వినోదాన్ని పంచుతోంది.

ఈ శుక్ర, శనివారాల్లో ఆహాలో మరింత సందడి చేయడానికి ‘మేజర్‌‌’ టీం నుంచి అడివి శేష్ (Adivi Sesh), శోభిత ధూళిపాళ మన ముందుకు వస్తున్నారు. అందరికీ దగ్గరవాడైన యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్న షో సర్కార్ 2. ప్రతి వారం అందరినీ అలరిస్తూ, మైమరిపిస్తున్న ప్రదీప్ ఈసారి మేజర్ టీంతో చేస్తున్న గమ్మతులు చేయనున్నాడు. ఈ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే సర్కార్‌‌ 2 షోలో అడివి శేష్‌ అల్లరి, ఆయన చేసే డ్యాన్స్‌లు అందరినీ అలరించనున్నాయి.

సంగీత కార్యక్రమాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోలో ఈ వారం అడివి శేష్ మరియు శోభిత చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వాగ్దేవి పాటతో అడివి శేష్ మైమరిచిపోతే, ఆయనే వైష్ణవితో డాన్స్ చేయాలని కోరడం షోకి మరో హైలైట్. అలా ఆట పాటలతో సాగిపోయే ఈ సుస్వరాల వేదిక మీ ఆహాలో (Aha) ఈ శుక్ర మరియు శనివారాలలో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!