మీకు అన్నీ ఇంట్రెస్టే అని నెటిజన్ కామెంట్.. కూల్‌గా రిప్లై ఇచ్చిన కృష్ణవంశీ (Krishna Vamsi)

Updated on May 05, 2022 04:01 PM IST
రంగమార్తాండ సినిమా సెట్స్‌లో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కృష్ణవంశీ (Krishna Vamsi)
రంగమార్తాండ సినిమా సెట్స్‌లో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కృష్ణవంశీ (Krishna Vamsi)

అచ్చమైన తెలుగు సినిమాకు కేరాఫ్‌ అడ్రస్ కృష్ణవంశీ (Krishna Vamsi). నిన్నే పెళ్లాడుతా, మురారి, చందమామ, గోవిందుడు అందరివాడేలే సినిమాలతో సూపర్‌‌హిట్లు అందుకున్న కృష్ణవంశీ.. తర్వాత సినిమాలకు కొంచెం దూరమయ్యాడనే చెప్పాలి. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘రంగమార్తాండ’.

ప్రకాష్‌రాజ్‌, రమ్మకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్‌‌ జంటలుగా రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నారు. యాంకర్‌‌ అనసూయ కీలకపాత్ర పోషిస్తోందని టాక్. రెండు సంవత్సరాల క్రితమే ఈ సినిమా తీస్తున్నట్టు కృష్ణవంశీ ప్రకటించినప్పటికీ.. ఎందుకో ఈ సినిమా షూటింగ్‌ ముందుకు సాగలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని చాలా మంది కామెంట్లు చేశారు.

అయితే రంగమార్తాండ సినిమా ఆగిపోలేదని, ఇటీవల సినిమా షూటింగ్‌ మొదలైందని కృష్ణవంశీ తెలిపారు. తాజాగా సినిమాలో పాటను చిత్రీకరిస్తున్నారు. శివాత్మిక, రాహుల్‌పై డ్యూయెట్‌ను షూట్‌ చేస్తున్నారని తెలుస్తోంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. కృష్ణవంశీ, ఇళయరాజా కాంబినేషన్‌లో వచ్చిన అంత:పురం సినిమా మ్యూజికల్‌గా కూడా హిట్‌ అయ్యింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కృష్ణవంశీ.. తన సినిమాలు, ఇతర విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కృష్ణవంశీ పెట్టిన పోస్టుకు ఒక అభిమాని నెగెటివ్‌గా కామెంట్‌ చేశాడు.దానికి కూడా పాజిటివ్‌గా కూల్‌గా ఆన్సర్‌‌ చెప్పిన కృష్ణవంశీ.. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు.

స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ తీసిన ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీస్’ అనే సినిమా చూశాను. చాలా బాగా తీశాడు. నాకు నచ్చింది అని ఫేస్‌బుక్‌లో కృష్ణవంశీ పోస్ట్‌ చేశాడు. దీనికి ఒక నెటిజన్‌ ‘నీకు అన్నీ ఇంట్రెస్టే.. నీ సినిమా విడుదల చేయడం తప్ప’ అని కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన కృష్ణవంశీ.. చాలా కూల్‌గా ‘గాడ్‌ బ్లెస్‌ యూ’ అని ఒక లవ్‌ సింబల్‌ను ట్యాగ్‌ చేశాడు.

మరాఠీలో విజయవంతమైన ‘నటసామ్రాట్‌’ సినిమాకు రీమేక్‌గా రంగమార్తాండ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కృష్ణవంశీ. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించిన కృష్ణవంశీ.. సినిమాలో ప్రకాష్‌రాజ్‌ లుక్‌ను షేర్‌‌ చేశాడు. రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథతో రంగమార్తాండ సినిమా తీస్తున్నానని చెప్పాడు కృష్ణవంశీ (Krishna Vamsi).

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!