‘ఆహా’లో విశ్వక్‌సేన్ (Vishwaksen) ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Updated on May 08, 2022 03:28 PM IST
అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా పోస్టర్, అల్లు అరవింద్
అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా పోస్టర్, అల్లు అరవింద్

ఫలక్​నుమా దాస్, పాగల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కల్యాణం’.  ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.  విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. తన ఇదివరకటి సినిమాలతో  మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్ సేన్ (Vishwaksen) తొలిసారిగా నటించిన కుటుంబ కథాచిత్రంగా మంచి పేరు తెచ్చుకుంటోంది ఈ సినిమా. ముప్పై ఏళ్ళొచ్చినా ఇంకా పెళ్ళికాని అల్లం అర్జున్ కుమార్‌కు ఒక అందమైన అమ్మాయితో పెళ్ళి కుదురుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా మగపెళ్ళివారు ఆడపెళ్ళివారింట్లో ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు జరిగే అనూహ్య సంఘటనల సమాహారమే ఈ సినిమా. చక్కటి కామెడీ, ఎంచక్కటి ఎమోషన్స్ ఈ సినిమా విజయానికి మూలస్థంభాలుగా నిలిచాయి. అయితే ఈ సినిమాను ‘ఆహా’ ఓటీటీలో జూన్ మొదటి వారంలో  స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.  సినిమా టైటిల్స్లోనే ఓటీటీ  రైట్స్ని‘ ఆహా’ దక్కించుకుందని తెలిపింది చిత్రబృందం.

అయితే ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో చిత్రయూనిట్ కు నిర్మాత అల్లు అరవింద్ సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి విశ్వక్ సేన్ తో పాటు చిత్ర యూనిట్ హాజరైంది. ఈ పార్టీ తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతున్నాయి.

మే 6న విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్ళు చెప్పుకోదగ్గ స్థాయిలోనే నమోదయ్యాయి. విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో జరిగిన రచ్చ, హీరో విశ్వక్ సేన్ (Vishwaksen) వినూత్న రీతిలో చేపట్టిన ప్రచారాలు సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి. దానికి తగ్గట్టుగానే కంటెంట్ కూడా బాగుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి మంచి ఆసక్తి చూపిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంలో ఇంకా గోపరాజు రమణ, రితికా నాయక్, కేదార్, వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జయక్రిష్ సంగీతం అందించగా.. పవి కె పవన్ ఛాయగ్రహణం నిర్వహించారు. కథ స్ర్కీన్ ప్లే మాటల్ని రవికిరణ్ కోలా అందించారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!