సినిమా హిట్‌ అయినప్పుడు నాన్న ఉంటే బాగుండనిపించింది.. మీడియాతో అల్లరి నరేష్ (Allari Naresh)

Updated on May 11, 2022 09:40 AM IST
నాంది సినిమాలో అల్లరి నరేష్ (Allari Naresh)
నాంది సినిమాలో అల్లరి నరేష్ (Allari Naresh)

అల్లరి సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చి అదే తన ఇంటి పేరుగా సెటిల్‌ అయిన హీరో అల్లరి నరేష్‌ (Allari Naresh). దివంగత స్టార్ డైరెక్టర్‌‌ ఈవీవీ సత్యనారాయణ రెండో కొడుకుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నరేష్‌.. మొదట్లో కామెడీ నేపథ్యం ఉన్న సినిమాల్లోనే నటించినా..క్రమంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే నటుడిగా ఎదిగాడు. ఆ క్రమంలో చేసిన సినిమానే ‘నాంది’. ఏ తప్పూ చేయకుండానే శిక్ష అనుభవించిన వ్యక్తి పాత్రలో నరేష్‌ నటన అందరికీ తెగ నచ్చేసింది. అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాకు దర్శకత్వం వహించిన కొత్త డైరెక్టర్‌‌ కనకమేడల విజయ్‌కు బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌‌ అవార్డు దక్కింది.

 సినిమా ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అల్లరి నరేష్‌ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాన్న ఈవీవీ సత్యనారాయణ వలనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయనను ఎంతగానో మిస్ అవుతున్నాను. నాన్న లేకపోవడంతోనే తనకు ప్లాపులు వస్తున్నాయనడం కరెక్ట్‌ కాదు. నాన్న  చనిపోయిన తర్వాత ‘సుడిగాడు’, ‘అహ నా పెళ్లంట’ సినిమాలు హిట్ అయ్యాయి.

ఇటీవల అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఆ సమయంలో నాన్న బతికుంటే బాగుండేదని అన్నాడు అల్లరి నరేష్. ఇక, మహేష్‌బాబు హీరోగా వచ్చి సూపర్‌‌ హిట్‌ అయిన ‘మహర్షి’ సినిమాలో మహేష్‌బాబు ఫ్రెండ్‌గా నటించాడు నరేష్‌. ఆ సినిమాలో నటనకుగాను నరేష్‌కు మంచిపేరు వచ్చింది.

దీంతో ఒక నిర్మాత తనను క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడచ్చు అని అన్నాడని చెప్పాడు నరేష్. అయితే నాంది సినిమా తర్వాత అదే నిర్మాత ఫోన్ చేసి తనను పొగిడాడని అన్నాడు. అయితే ఎవరి కెరీర్ ఎలా ముగుస్తుందో ఎవరూ డిసైడ్ చేయలేరని అన్నాడు నరేష్‌ (Allari Naresh)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!