యాక్ట్‌ చేయమని అడిగితే మహేష్‌బాబు (MaheshBabu) స్టూడియో మొత్తం పరిగెత్తించాడు..స్పెషల్‌ వీడియో ప్రోమోలో కృష్ణ

Updated on May 29, 2022 04:18 PM IST
మహేష్‌బాబు (MaheshBabu) అక్క మంజుల, కృష్ణ
మహేష్‌బాబు (MaheshBabu) అక్క మంజుల, కృష్ణ

విభిన్నమైన కథలు, పాత్రలు, సినిమా పరంగా ఏదైనా ప్రయోగం చేయాలన్నా, కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలన్నా ముందుండే వారు సూపర్‌‌స్టార్ కృష్ణ. జేమ్స్‌బాండ్‌ తరహా క్యారెక్టర్లను టాలీవుడ్‌కు పరిచయం చేసి నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారాయన. అదొక్కటే కాదు అలాంటివి ఎన్నో కొత్త విషయాలను, కథలను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశారు కృష్ణ. ప్రస్తుతం ఆయన కొడుకు సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu) ఇండస్ట్రీలో స్టార్‌‌ హీరోగా కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం వయసు రీత్యా సినిమాలకు, మీడియాకు దూరంగా ఉంటున్నారు కృష్ణ. ఇంటి నుంచి బయటకు కూడా రాకుండా ఇంటికే పరిమితయ్యారాయన. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో మాత్రమే అడపాదడపా కనిపిస్తున్నారు కృష్ణ. ఇక, కృష్ణ పెద్ద కూతురు మంజుల కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. పలు సినిమాల్లో నటించింది ఆమె. అంతేకాకుండా దర్శకత్వం కూడా చేసింది. త్వరలో కృష్ణ పుట్టినరోజు రాబోతోంది. ఈ సందర్భంగా కృష్ణ అభిమానులకు ఒక సర్‌‌ప్రైజ్‌ ప్లాన్ చేసింది మంజుల.

మహేష్‌బాబు (MaheshBabu) అక్క మంజుల.. కృష్ణతో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ పోస్టర్

మంజుల సొంత యూట్యూబ్‌ చానల్‌లో..

మంజులకు ఒక యూట్యూబ్ చానల్ ఉంది. కృష్ణ వ్యక్తిగత విషయాలు, సినిమా కెరీర్‌‌ తదితర ఆసక్తికర విషయాలను తన యూట్యూబ్ చానల్ ద్వారా అభిమానులకు తెలియజేయాలని అనుకుంది మంజుల. వెంటనే కృష్ణతో ఇంటర్వ్యూ చేసింది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆ స్పెషల్ ఇంటర్వ్యూ వీడియోను విడుదల చేయనుంది మంజుల. దానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. ఆ ప్రోమో వీడియోలో ఎక్కడో పల్లెటూరిలో ఉండే కృష్ణ సినిమాల్లోకి వచ్చి హీరో ఎలా అయ్యారు. సినిమాల్లోకి ఎలా వచ్చారు. మహేష్‌ను సినిమాల్లోకి ఎలా తీసుకువచ్చారనే ఆసక్తికర విషయాలపై కృష్ణతో చర్చించింది మంజుల.

ఇటీవల జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్‌లో కుటుంబ సభ్యులతో కృష్ణ

చిన్నప్పుడే సూపర్‌‌స్టార్‌‌ను చేయాలని ప్లాన్‌ చేశారా?

మహేష్‌ను చిన్నప్పుడే సూపర్‌‌స్టార్‌‌ను చేశారు. ఇది ప్లాన్డ్‌గా జరిగిందా లేక అనుకోకుండా జరిగిందా? అని కృష్ణను మంజుల ప్రశ్నించింది. దానికి కృష్ణ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అది కృష్ణ మాటల్లోనే.. ‘ఒక రోజు షూటింగ్‌ చూస్తానని మహేష్. స్టూడియోకి వచ్చాడు. దూరం నుంచి షూటింగ్ చూస్తూ నిలబడ్డాడు. దగ్గరకు పిలిచి ఒకసారి యాక్ట్‌ చేయమని అడిగితే.. లేదు నేను యాక్ట్‌ చేయను చేయను అంటూ స్టూడియో మొత్తం పరిగెత్తించాడు’ అని మహేష్‌ గురించి చెబుతూ మురిసిపోయారు కృష్ణ. మహేష్‌తో కలిసి తాను చూసిన పోకిరి, దూకుడు ల్యాండ్ మార్క్ సినిమాలు అయ్యాయని చెప్పారు.

రెండు రోజుల్లో ఫుల్‌ వీడియో..

తన గురించి, కొడుకు మహేష్‌బాబు (MaheshBabu) గురించి మంజుల అడిగిన ప్రశ్నలకు ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానాలు చెప్పారు కృష్ణ. అయితే ఆ సమాధానాలు ఏంటి అనే పూర్తి వీడియో చూడాలంటే మాత్రం మరో రెండు రోజులు ఆగాల్సిందే. సూపర్‌‌స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న పూర్తి వీడియోను మంజుల తన యూట్యూబ్‌ చానల్‌లో విడుదల చేయనుంది.

సూపర్‌‌స్టార్ కృష్ణతో మహేష్‌బాబు (MaheshBabu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!