కమల్ హాసన్‌ (Kamal Haasan) ‘విక్రమ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా విక్టరీ వెంకటేష్‌.. వెల్లడించిన మేకర్స్

Updated on May 30, 2022 08:37 PM IST
వెంకటేష్, క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)
వెంకటేష్, క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)

లోకనాయకుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) హీరోగా న‌టించిన సినిమా విక్రమ్. మాస్టర్ ఫేం లోకేష్‌ క‌న‌గ‌రాజ్ ద‌ర్శక‌త్వం వ‌హించాడు. పోయినేడాది విడుద‌లైన టైటిల్, టీజ‌ర్ నుంచి ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌ వ‌ర‌కు అన్నీ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. కొంతకాలంగా క‌మ‌ల్ నుంచి ఆశించిన స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ క్రమంలో విక్రమ్‌ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ అప్పటి క‌మ‌ల్‌ను గుర్తుచేస్తున్నాయి. యాక్షన్ థ్రిల్ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా జూన్‌3న విడుద‌ల కానుంది.

ఇక విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 31న జరగ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ వేడుక‌కు గెస్ట్‌గా స్టార్‌‌ హీరో రానున్నాడు. హైద‌రాబాద్‌లోని శిల్పక‌ళావేదిక‌లో మే 31న జ‌రగ‌నున్న విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విక్టరీ వెంక‌టేష్ గెస్ట్‌గా రాబోతున్నట్లు మేక‌ర్స్ ప్రక‌టించారు. వెంక‌టేష్‌, క‌మ‌ల్ మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే విక్రమ్ ఈవెంట్‌కు వెంకీని గెస్ట్‌గా పిలిచాడ‌ట‌  కమల్. వెంక‌టేష్ కూడా ఈవెంట్‌కు రావడానికి వెంట‌నే ఓకే చెప్పేశాడట‌.

క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పోస్టర్

విక్రమ్‌ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్‌, తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్రల్లో న‌టించారు. సూర్య గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. అనిరుధ్ ర‌విచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా కమల్‌ హాసన్ (Kamal Haasan) సొంత బ్యానర్‌‌ అయిన రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్, ఆర్. మహేంద్రన్‌ తెర‌కెక్కింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!