వెంకీ (Venkatesh) చెల్లిగా న‌టించ‌నున్న‌ పూజ హెగ్డే(Pooja Hegde)

Updated on May 17, 2022 04:24 PM IST
కభీ ఈద్ కభీ దివాళి సినిమాలో వెంక‌టేష్, పూజ హెగ్డే అన్నా చెల్లెలుగా న‌టిస్తున్నార‌ట‌
కభీ ఈద్ కభీ దివాళి సినిమాలో వెంక‌టేష్, పూజ హెగ్డే అన్నా చెల్లెలుగా న‌టిస్తున్నార‌ట‌

ఎఫ్3లో వెంక‌టేష్‌తో క‌లిసి పార్టీ సాంగ్ చేసింది పూజ హెగ్డే (Pooja Hegde). ఆ సాంగ్ హింట్ ఇప్ప‌టికే ట్రేండీగా మారింది. మ‌రో సినిమాలో వెంక‌టేష్, పూజ హెగ్డే అన్నా చెల్లెలుగా న‌టిస్తున్నార‌ట‌. హిందీ సినిమాలో వీరిద్ద‌రు బాండింగ్ క్రేజీగా ఉంటుంద‌ట‌. 

 

కభీ ఈద్ కభీ దీవాళి సినిమాలో స‌ల్మాన్‌ఖాన్ న్యూ లుక్

మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘కభీ ఈద్ కభీ దీవాళి’లో స‌ల్మాన్‌ఖాన్‌కు జోడిగా పూజ‌హెగ్డే న‌టిస్తున్నారు. దర్శకుడు ఫర్హాద్ సామ్జీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో వెంక‌టేష్ కూడా న‌టిస్తున్నారు. పూజ హెగ్డేకు అన్న‌గా వెంకీ యాక్ట్ చేయ‌నున్నారు. నదియాద్వాలా బ్యానర్‌పై ఈ సినిమా వ‌స్తుంది. న‌దియాద్వాలా, సల్మాన్ ఖాన్ క‌భీ ఈద్ క‌భీ దీవాళి సినిమా నిర్మాత‌లు. ‘

టైగర్ 3’ తర్వాత తన నెక్ట్స్ ఫిల్మ్ కభీ ఈద్ కభీ దివాళి అంటూ స‌ల్మాన్ ఇప్ప‌టికే అభిమానుల‌కు తెలిపాడు. ఇక వెంకీ, పూజ‌హెగ్డేలు అన్నా చెల్లెలుగా న‌టించ‌డం బిగ్ సప్రైజ్‌గా ఉండ‌నుంది. వీరిద్ద‌రి క్యారెక్ట‌ర్లు సినిమాకు ప్ల‌స్ అంటున్నారు. పూజ కూడా త‌న ఇస్టాలో పోస్ట్ చేసిన‌ స‌ల్మాన్ బ్రాస్‌లైట్ ధ‌రించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. 

టాలీవుడ్ నుంచి వెంక‌టేష్‌తో పాటు జ‌గ‌ప‌తి బాబు కూడా స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమాలో కీల‌క రోల్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కభీ ఈద్ కభీ దీవాళి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 2022 డిసెంబ‌ర్‌లో స‌ల్మాన్‌ఖాన్ కభీ ఈద్ కభీ దీవాళి రిలీజ్ కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!