డబుల్ డోస్ కామెడీతో అలరిస్తున్న విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ఎఫ్3 ట్రైలర్

Updated on May 09, 2022 03:01 PM IST
విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ఎఫ్‌3 ట్రైలర్
విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ఎఫ్‌3 ట్రైలర్

‘‘వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ’’, ‘‘వాళ్లది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ” అంటున్న వెంకీ (Venkatesh), వరుణ్​

ఫన్​ అండ్​ ఫ్రస్టేషన్​ అంటూ ఎఫ్​2తో సంక్రాంతి అల్లుళ్లుగా వచ్చి హిట్​ కొట్టిన విక్టరీ వెంకటేష్​, వరుణ్​ తేజ్​ ఈసారి ఎఫ్​3తో ‘సమ్మర్​ సోగ్గాళ్లు’గా రానున్నారు.  ఆధునిక జంధ్యాలగా పేరు దక్కించుకున్న కామెడీ సినిమాల దర్శకుడు అనిల్​ రావిపూడి రూపొందిన సినిమా ఎఫ్​2. దీనికి సీక్వెల్​గా ఇప్పుడు ఎఫ్​3తో టాలీవుడ్​ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యారు. వేసవి కానుకగా మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఎఫ్​3 ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.  ట్రైలర్‌లోని సన్నివేశాలు, నటీనటుల డైలాగ్స్‌ చూస్తే ‘ఎఫ్‌-2’తో పోలిస్తే ‘ఎఫ్‌-3’లో ఫన్‌ డోస్‌ మరింత పెరిగినట్లు అర్థమవుతోంది.

‘‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు అయిదే. కానీ ఆరో భూతం ఒకటి ఉంది. అదే డబ్బు’’ అంటూ మురళీశర్మ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది. ఓ వైపు రేచీకటి వ్యక్తిగా వెంకీ.. నత్తి ఉన్న వ్యక్తిగా వరుణ్‌ ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పీక్స్‌లో ఉంది. ఇక, డబ్బు కోసం వాళ్లు పడే పాట్లు, తమన్నా, మెహ్రీన్‌ అండ్‌ ఫ్యామిలీ చేసే పనులు.. దానికి మన హీరోలు ఇచ్చే రియాక్షన్ ఈలలు వేయించేలా ఉన్నాయి. ట్రైలర్‌ చివర్లో  ‘అంతేగా అంతేగా’ డైలాగ్‌ మరింత నవ్వులు పూయించేలా ఉంది.

ఈ సినిమాలోనూ ‘వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ’’, ‘‘వాళ్లది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ’’ అంటూ మరింతగా నవ్వించనున్నారు ఈ తోడల్లుళ్లు. ఈ సినిమాలో వీరిద్దరికి తోడుగా రాజేంద్రప్రసాద్, సునీల్​ కామెడీ కూడా తోడవడం మరిన్ని నవ్వులు పూయించేలా ఉంది.

ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మొదటి భాగాన్ని మించిన వినోదం రెండో భాగంలో ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా కథంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఉన్నోడికి ఫన్.. లేనోడికి ఫ్రస్ట్రేషన్ అని మురళీ శర్మ పాత్రతో డైలాగ్ చెప్పించడం ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి మేకింగ్, టేకింగ్, అండ్ రైటింగ్ తో ఈ సినిమాకి డబుల్ వినోదాన్ని అందించబోతున్నాడు. అత్తగారు‌గా అన్నపూర్ణమ్మ, ప్రగతి పాత్రలు రెండో భాగంలోనూ కంటిన్యూ అవుతున్నాయి.  ఆ ఇద్దరి నవ్వుల సందడి ఈ సినిమాలో కాస్తంత ఎక్కువ మోతాదులోనే ఉండబోతోంది. ఇంకా రాజేంద్రప్రసాద్ పోలీస్ పాత్రలో నవ్వించబోతున్నారు. సునీల్ కూడా తనదైన స్టైల్లో కామెడీ పండించబోతున్నాడు. వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్​ తమ హిలేరియస్ కామెడీతో ట్రైలర్ నిండా సందడి చేశారు. కామెడీ టైమింగ్ లో తిరుగులేని వెంకీ, తెలంగాణ యాసలో అదరగొట్టబోతున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఈ సమ్మర్ మొత్తాన్ని కేప్చర్ చేస్తారని అనిపిస్తోంది. కామెడీ‌  ఎంటర్‌టైనర్స్‌కు ఒక సీజన్ అంటూ ఉండదు కాబట్టి.. ఈ సినిమా ఏమాత్రం బాగున్నా.. ఎండల్ని సైతం లెక్కచేయకుండా.. థియేటర్స్ కు జనం క్యూ కడతారని చెప్పుకోవచ్చు.  ప్రేక్షకులకు ఏ తరహా కామెడీ కావాలో బాగా తెలిసిన అనిల్ రావిపూడి  కెరీర్ లో ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి మరి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!