వెంకటేష్ (Venkatesh), వరుణ్‌తేజ్ (Varun Tej) ‘ఎఫ్3’ సినిమాలో వినోదం 100% ఉంటుందంటున్న ప్రగతి
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాలో పుట్టిన ప్రగతి.. మైసూర్ సిల్క్ ప్యాలెస్‌లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత మూడు సంవత్సరాలపాటు తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. అనంతరం పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత సీరియల్స్‌లో నటిస్తూ 2002లో బాబీ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
అప్పటి నుంచి దాదాపు వందకుపైగా సినిమాల్లో నటించిన ప్రగతి.. అందరు అగ్ర హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ (Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (Varun Tej), నటించిన ఎఫ్3 సినిమాలో హీరోయిన్లు తమన్నా, మెహరీన్‌కు తల్లిగా నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్2 సినిమాలో కూడా మంచి పాత్ర చేసిన ప్రగతి.. ఎఫ్3లో కీలక పాత్ర చేసినట్టు తెలుస్తోంది.
ఎఫ్2లో ప్రగతి చేసిన కామెడీ ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని అందించింది. అప్పటివరకు ప్రగతి నుంచి ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని కామెడీ యాంగిల్ బయటపడింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఎఫ్2 ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. అయితే దానికి సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3 కూడా అంతకు మించి వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తుందని ప్రగతి చెబుతోంది.
ఎఫ్3లో హీరోయిన్లకు తల్లిగా.. పెద్ద క్యారెక్టర్ పోషించానని చెప్పింది ప్రగతి. అయితే, సినిమా కథ పూర్తిగా తనకు తెలియదని, డైరెక్టర్ తనకు మొత్తం కథ చెప్పలేదని తెలిపింది. తనకు సంబంధించిన సీన్స్ మాత్రమే డైరెక్టర్ అనిల్ చెప్పాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ తన పాత్రను మాత్రం డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడని తెలిపింది.
‘ఎఫ్3 సినిమా కథ నాకు అంతగా కనెక్ట్ అయ్యిందా అని చాలా మంది అడుగుతున్నారు. అయితే నాకంత సీన్ లేదు. సినిమా పూర్తి కథ నాకు తెలీదు. డైరెక్టర్ నాకు పూర్తి కథ చెప్పాలేదు. నా పాత్ర వరకే చెప్పారు. ఇక, ఏ విషయాన్నైనా వరుణ్‌తేజ్ (Varun Tej), త్వరగా పట్టుకుంటారు. ఏదైనా విన్నా, చూసినా ఇట్టే పసిగట్టేస్తారు. వెంకటేష్ (Venkatesh) గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆయన సెట్‌లోకి రావడంతోనే యాక్టింగ్ మూడ్‌లోకి వెళిపోతారు’ అని చెప్పింది ప్రగతి. దిల్ రాజు నిర్మించిన ఎఫ్3 సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.