వెంకటేష్ (Venkatesh), సాయి పల్లవి, మంచు లక్ష్మి చేతుల మీదుగా ‘777 చార్లి’ తెలుగు ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే?

Updated on May 15, 2022 11:47 PM IST
 ‘777 చార్లి’  సినిమా పోస్టర్
‘777 చార్లి’ సినిమా పోస్టర్

కన్నడ హీరో రక్షిత్‌శెట్టి హీరోగా నటించిన సినిమా ‘777 చార్లి’. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌ రిలీజ్ చేయనుంది. 777 చార్లి సినిమా తెలుగు ట్రైలర్‌‌ సోమవారం విడుదల కానుంది. ఈ ట్రైలర్‌‌ను పలువురు సెలబ్రిటీలు లాంచ్ చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12:12 నిమిషాలకు విక్టరీ వెంకటేష్‌ (Venkatesh), సాయి పల్లవి, మంచు లక్ష్మి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రానా సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.

బాహుబలి సినిమాలో తన నటనతో మంచి మార్కులు వేయించుకున్న రానా (Rana).. ప్రస్తుతం సినిమా సమర్పకుడిగా కూడా మారుతున్నాడు. పాన్‌ ఇండియా మూవీ 777 చార్లి  సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయనున్నాడు.

‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాతో సినీ ప్రేక్షకులకు దగ్గరైన హీరో రక్షిత్‌శెట్టి. ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ‘777 చార్లి’ సినిమా తెరకెక్కించాడు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో జూన్‌ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది.

చార్లి అనే కుక్క పిల్ల ఇంట్లో నుంచి బయటికి వచ్చి తప్పిపోతుంది. ఈ పరిస్థితుల్లో బయట చార్లి పడిన ఇబ్బందులు ఏమిటి. ధర్మ అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది. వారి మధ్య రిలేషన్‌ ఏంటి. చివరకు ఏం జరిగింది. 777 చార్లి అనే అడ్వంచరస్‌ కామెడీని సినిమా ద్వారా చూపించబోతున్నాడు. జీఎస్‌ గుప్తాతో కలిసి పరమ్‌వహ్‌ బ్యానర్‌‌పై సినిమాను రక్షిత్‌శెట్టి నిర్మిస్తున్నాడు. కిరణ్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంగీత శ్రింగేరి, రాజ్‌ బి.శెట్టి, డానిష్‌ సెయింట్, బాబీ సింహ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. 777 చార్లి సినిమాలో సంగీత శృంగేరీ, రాజ్‌ బి శెట్టి, డానిష్‌ సేత్, బాబి సింహా కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌‌ను వెంకటేష్‌ (Venkatesh), సాయి పల్లవి, మంచు లక్ష్మిసహా పలువురు సెలబ్రిటీలు విడుదల చేయనున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!