దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు దక్కించుకున్న సూర్య (Suriya) జై భీమ్, అల్లరి నరేష్‌ (Allari Naresh) నాంది సినిమాలు

Updated on May 05, 2022 08:07 PM IST
సూర్య (Suriya), అల్లరి నరేష్‌ (Allari Naresh)
సూర్య (Suriya), అల్లరి నరేష్‌ (Allari Naresh)

కొన్ని సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి.. కొన్ని వాటిని బద్దలు కొడతాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం చరిత్రతోపాటు గుండెల్లో కూడా నిలిచిపోతాయి. అటువంటి సినిమాల లిస్ట్‌లో తమిళ స్టార్‌‌ హీరో సూర్య (Suriya) నటించిన ‘జై భీమ్‌’ ఒకటి కాగా.. మరొకటి అల్లరి నరేష్‌ (Allari Naresh) హీరోగా నటించిన ‘నాంది’.

సూర్య ఎంత మంచి నటుడో అందరికీ తెలిసిందే. తమిళంతోపాటు తెలుగులో కూడా సూర్యకి ఫ్యాన్స్ ఉన్నారు. సూర్య సినిమా తెలుగులో రిలీజ్ చేస్తే మినిమం వసూళ్లు వస్తాయి. జై భీమ్‌ వంటి సామాజిక నేపథ్యం ఉన్న సినిమా. అందులోనూ సూర్య నటించిన తీరు ప్రేక్షకులను థియేటర్లలో కుర్చీలకు కట్టేసిందనే చెప్పాలి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకోకుండా థియేటర్‌‌లో నుంచి బయటకు రాలేదంటే సూర్య యాక్టింగ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు,

ఇక, అల్లరి సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చి అదే తన ఇంటి పేరుగా సెటిల్‌ అయిన హీరో అల్లరి నరేష్‌. దివంగత స్టార్ డైరెక్టర్‌‌ ఈవీవీ సత్యనారాయణ రెండో కొడుకుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నరేష్‌.. మొదట్లో కామెడీ నేపథ్యం ఉన్న సినిమాల్లోనే నటించినా..క్రమంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే నటుడిగా ఎదిగాడు. ఆ క్రమంలో చేసిన సినిమానే ‘నాంది’. ఏ తప్పూ చేయకుండానే శిక్ష అనుభవించిన వ్యక్తి పాత్రలో నరేష్‌ నటన అందరికీ తెగ నచ్చేసింది.

ఇప్పటికే ఈ రెండు సినిమాలకు పలు అవార్డులు దక్కాయి. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు దక్కడం సంతోషకరం. ప్రతి ఏడాది జరిగినట్టుగానే ఈ ఏడాది కూడా దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ 2022 ఘనంగా జరిగింది. ఈ 12వ ఫిలిం ఫెస్టివల్‌లో జై భీమ్‌, నాంది సినిమాలకు అవార్డులు దక్కాయి. దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాగా సూర్య (Suriya)  నటించిన జై భీమ్‌ నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాలోని నటనకుగాను బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌‌గా మణికందన్‌కు అవార్డు వచ్చింది. ఇక అల్లరి నరేష్  (Allari Naresh) నటించిన నాంది సినిమాకు దర్శకత్వం వహించిన కొత్త డైరెక్టర్‌‌ కనకమేడల విజయ్‌కు బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌‌ అవార్డు దక్కింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!