మహేష్‌బాబు (Mahesh Babu) అల్లూరి సీతారామరాజు సినిమా కచ్చితంగా చేయడు : సూపర్‌‌స్టార్ కృష్ణ

Updated on May 22, 2022 01:24 PM IST
సూపర్‌‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు (MaheshBabu)
సూపర్‌‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు (MaheshBabu)

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (MaheshBabu) నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో నడిచింది ఈ చిత్రం. అంతే కాదు, ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160 కోట్ల గ్రాస్‌ సాధించింది. సర్కారు వారి పాట సినిమాపై మహేశ్‌ తండ్రి, సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇటీవలే స్పందించారు.

సినిమా సక్సెస్‌ అయిన సందర్భంగా కృష్ణ ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడారు. చిత్రం ఘనవిజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘మహేశ్‌ సర్కారు వారి పాట చాలా బాగుంది. ఫస్ట్‌ హాఫ్ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌‌ను అందిస్తే, సెకండ్‌ హాఫ్‌లో మహేశ్‌ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. మూవీ కలెక్షన్స్‌ అన్ని సెంటర్స్‌లోనూ బాగున్నాయి. కొన్ని ఛానల్స్‌ మాత్రమే మూవీ బాగాలేదని ప్రచారం చేస్తున్నాయి’ అని కృష్ణ తెలిపారు.  పోకిరి కంటే యంగ్‌గా ఈ సినిమాలో మహేశ్‌ కనిపిస్తున్నాడని, తన తనయుడికి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు కృష్ణ. అలాగే షూటింగ్‌ లేని రోజుల్లో మహేష్‌ ఎక్కువ సమయం జిమ్‌లోనే ఉంటాడన్నారు.

ఇక, "సర్కారు వారి పాట సినిమా గురించి సుప్రీంకోర్టులో మాట్లాడాలని, అంత మంచి కథ తీసుకున్నారని" కృష్ణ చెప్పారు. మే 31వ తేదీన ఆయన బర్త్‌డే వేడుకలను ఉద్దేశించి కూడా కృష్ణ మాట్లాడారు. "కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల,  5 సంవత్సరాలుగా బయటకు వెళ్లడం లేదు. చిన్న కూతురు ప్రియదర్శిని, ఇంట్లోనే నాకు ఇష్టమైన వంటకాలు అన్నీ చేస్తుందని" తెలిపారు. సర్కారు వారి పాట సినిమాను తన ఇంట్లోనే హోం థియేటర్‌‌లో చూశానని, సినిమా చూడగానే మహేశ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడానని తెలిపారు కృష్ణ.

"మహేష్.. నువ్వు చాలా బాగా నటించావు. పోకిరి, దూకుడు కంటే 'సర్కారు వారి పాట' సినిమా పెద్ద హిట్‌ అవుతుంది" అని చెప్పానని, దాంతో మహేష్‌ చాలా హ్యాపీ ఫీలయ్యాడని తర పుత్రోత్సాహాన్ని బయటపెట్టారు కృష్ణ . మహేశ్‌, అల్లూరి సీతారామరాజు సినిమా చేసే అవకాశం భవిష్యత్తులో ఉందా? అని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన జవాబిచ్చారు.  వందశాతం ఆ మూవీని మహేష్‌బాబు (Mahesh Babu)  చేయబోడని కృష్ణ అభిప్రాయపడ్డారు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!