తలకిందులుగా పుషప్స్‌ చేస్తూ సూపర్‌‌ ఫిట్‌గా సుధీర్‌‌బాబు (Sudheer Babu).. ‘సుధీర్‌‌16’ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

Updated on May 11, 2022 10:13 PM IST
సుధీర్ బాబు (Sudheer Babu) కొత్త సినిమా పోస్టర్ రిలీజ్
సుధీర్ బాబు (Sudheer Babu) కొత్త సినిమా పోస్టర్ రిలీజ్

వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు యంగ్‌హీరో సుధీర్‌‌బాబు (Sudheer Babu). ఇప్పటికే సుధీర్ హీరోగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఇటీవలే శ్రీదేవి సోడా సెంటర్‌‌ సినిమాతో హిట్‌అందుకున్న సుధీర్‌‌.. బుధవారం పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే ‘మామా మశ్చీంద్ర’ ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్.

ఇప్పుడు తాజాగా మరో సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కూడా వచ్చింది. ఇంకా పేరు పెట్టని సుధీర్‌‌బాబు సినిమాకు సంబంధించిన ఆకర్షణీయమైన పోస్టర్‌‌ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్‌‌లో సుధీర్‌‌ తలకిందులుగా పుషప్స్‌ చేస్తున్నట్టు, సూపర్‌‌ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. గన్స్‌ డోంట్‌ లై అనే ట్యాగ్‌ లైన్‌తో ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో శ్రీకాంత్‌తోపాటు ప్రేమిస్తే ఫేమ్‌ భరత్‌ కీలక పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తోంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌‌గా వస్తున్న ఈ సినిమాను ప్రస్తుతం ‘సుధీర్‌‌16’గా పిలుస్తున్నారు.

‘మామా మశ్చీంద్ర’ పోస్టర్‌‌లో సుధీర్‌‌బాబు స్టేజీపై పాట పాడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు సుధీర్. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ‘మామా మశ్చీంద్ర’ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌‌పై నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్, పి.రామ్‌ మోహన్‌రావు నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పీజీ వింద సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తున్నారు.

సుధీర్‌‌బాబు హీరోగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా చేసింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు వివేక్ సాగర్‌‌ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ ఈ సినిమాను నిర్మించాయి. సుధీర్‌‌బాబుకి (Sudheer Babu) పుట్టినరోజు శుభాకాంక్షలు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!