‘మామా మశ్చీంద్ర’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్న హీరో సుధీర్‌‌ బాబు (Sudheer Babu)

Updated on May 11, 2022 11:00 PM IST
‘మామా మశ్చీంద్ర’ సినిమా పోస్టర్‌‌లో సుధీర్‌‌బాబు (Sudheer Babu)
‘మామా మశ్చీంద్ర’ సినిమా పోస్టర్‌‌లో సుధీర్‌‌బాబు (Sudheer Babu)

యంగ్‌ హీరో సుధీర్‌‌ బాబు విభిన్న కథలను ఎంచుకుంటూ తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గౌతం వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏ మాయ చేశావె’ సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుధీర్‌ (Sudheer Babu)‌.. ఎస్‌ఎమ్‌ఎస్‌ (శివ మనసులో శృతి) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ప్రేమ కథా చిత్రం సినిమాతో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సుధీర్‌‌బాబు.. సమ్మోహనం సినిమాలోని నటనకు సైమా స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. ప్రస్తుతం మరో కొత్త సినిమాతో మన ముందుకు రానున్నాడు. బుధవారం సుధీర్‌‌ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘మామా మశ్చీంద్ర’ అనే టైటిల్‌ను రిలీజ్‌ చేశారు. సినిమా టైటిల్‌తోపాటు సుధీర్‌‌ ఫస్ట్‌ లుక్‌ కూడా రివీల్‌ చేసింది చిత్ర యూనిట్.

పోస్టర్‌‌లో సుధీర్‌‌బాబు స్టేజీపై పాట పాడుతున్నట్టుగా పోస్టర్‌‌లో కనిపిస్తున్నాడు సుధీర్. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ‘మామా మశ్చీంద్ర’ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌‌పై నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్, పి.రామ్‌ మోహన్‌రావు నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పీజీ వింద సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తున్నారు.

సుధీర్‌‌బాబు హీరోగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా చేసింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు వివేక్ సాగర్‌‌ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ ఈ సినిమాను నిర్మించాయి. సుధీర్‌‌బాబుకి (Sudheer Babu) పుట్టినరోజు శుభాకాంక్షలు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!