విజయ్‌ (Vijay) ‘దళపతి 66’ సినిమాలో మరో ముగ్గురు స్టార్లు.. శ్రీకాంత్‌, సంగీత, శ్యామ్‌కు వెల్‌కమ్ చెప్పిన చిత్ర యూనిట్

Updated on May 11, 2022 10:28 PM IST
విజయ్ (Vijay) , శ్రీకాంత్, సంగీత, శ్యామ్
విజయ్ (Vijay) , శ్రీకాంత్, సంగీత, శ్యామ్

బీస్ట్ సినిమాతో ఇటీవలే టాలీవుడ్‌నూ పలకరించాడు విజయ్ (Vijay). ఆ సినిమా తర్వాత విజయ్ వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడు. బీస్ట్ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో తన తదుపరి సినిమాతో సూపర్‌‌హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్. మరోవైపు విజయ్‌ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని వంశీ పైడిపల్లి కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమా కోసం స్టార్ యాక్టర్లను సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడు వంశీ.

ఇప్పటికే పలువురు సీనియర్ యాక్లర్లు శరత్‌ కుమార్, ప్రభులను ఎంపిక చేసిన టీమ్... ప్రస్తుతం మరో ముగ్గురిని ఎంపిక చేసినట్టు వెల్లడించింది. వారిలో సీనియర్ హీరో శ్రీకాంత్, హీరోయిన్‌ శ్యామ్, యాక్టర్‌‌ శ్యామ్‌ ఉన్నారు. వారికి వెల్‌కమ్‌ చెప్పింది చిత్ర యూనిట్.

తమిళ్‌లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో విజయ్. విజయ్ సినిమా వస్తోందంటే మాస్ ప్రేక్షకులకు పండగే. బీస్ట్ సినిమా ప్రేక్షకులను నిరాశపరచిన తర్వాత విజయ్‌ ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఇక, ఈ సినామ విజయంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే దర్శకుడు వంశీ  కూడా భారీ తారాగణంతోనే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాలోని కీలకపాత్రల కోసం తమిళంలో స్టార్‌‌ యాక్టర్లు శరత్‌ కుమార్, ప్రభును ఎంపిక చేశాడు. దళపతి 66లో రష్మికా మందాన హీరోయిన్‌గా చేస్తోంది.

ఏ సినిమాకైనా బలం మ్యూజిక్.. ఈ మధ్య కాలంలో బ్యాక్‌ టు బ్యాక్ హిట్ సినిమాలతో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌‌గా కొనసాగుతున్నాడు ఎస్‌ఎస్‌ థమన్. అఖండ, భీమ్లానాయక్, సర్కారు వారి పాట సినిమాలకు మ్యూజిక్ అందించిన థమన్.. సంగీత ప్రియుల నుంచి మంచి మార్కులే కొట్టేశాడు. దీంతో దళపతి 66 సినిమాకు కూడా థమన్‌ నే ఎంపిక చేశారు దర్శకనిర్మాతలు.

ఇక, టాలీవుడ్‌లోని దాదాపు అందరి అగ్రహీరోలతో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై సినిమా తీసిన దిల్‌ రాజు ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో రాంచరణ్‌తో సినిమా నిర్మిస్తున్నాడు. ఆర్‌‌సీ 15 కోసం భారీ బడ్జెట్‌ పెట్టి సినిమా తీస్తున్న దిల్‌ రాజు.. విజయ్‌ సినిమాకి కూడా దాదాపుగా వంద కోట్లు బడ్జెట్‌ కేటాయంచనున్నట్టు తెలుస్తోంది. వరుసగా భారీ పాన్‌ ఇండియా సినిమాలు నిర్మిస్తూ ఖలేజా ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్నాడు దిల్‌ రాజు.  విజయ్ (Vijay), దిల్‌ రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దళపతి 66 ప్రేక్షకులకు ఏ మేరకు చేరువవుతుందో చూడాలి మరి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!