దేశాన్ని ప్రేమించేటోళ్లను కాపాడడం సోల్జర్ పని.. ఆకట్టుకుంటున్న అడివి శేష్‌ (Adivi Sesh) మేజర్ ట్రైలర్

Updated on May 09, 2022 08:11 PM IST
అడివా శేష్‌ (Adivi Sesh) మేజర్‌‌ ట్రైలర్‌‌ రిలీజ్ పోస్టర్
అడివా శేష్‌ (Adivi Sesh) మేజర్‌‌ ట్రైలర్‌‌ రిలీజ్ పోస్టర్

సోల్జర్‌‌ ఎందుకు అవ్వాలనుకుంటార్రా.. దేశభక్తా?

దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లను కాపాడడం సోల్జర్‌‌..

Don’t come up.. I will handle them..

డైలాగులతో  అడివి శేష్‌ (Adivi Sesh) మేజర్ ట్రైలర్‌‌ ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్దిసేపటికే లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేజర్ ట్రైలర్‌‌ సోమవారం రిలీజ్ అయ్యింది.

ఇక, 26/11 ముంబై దాడుల్లో మరణించిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘మేజర్‌‌’. అడివి శేష్‌ (Adivi Sesh) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కరోనా వ్యాప్తితోపాటు ఇతర కారణాలతో ఈ సినిమా విడుదల పలుసార్లు వాయిదా పడింది. ఇక, ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడం, పరిస్ధితులు సాధారణ స్ధితికి చేరుకోవడంతో చిత్ర యూనిట్‌ సినిమా విడుదల తేదీని ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 3న మేజర్‌‌ సినిమాను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని అడివి శేష్‌ తన ట్విట్టర్‌‌ ఖాతాలో వెల్లడించాడు. ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ పిల్మ్స్‌ ఇండియా, మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించాయి. అయితే, పోయినేడాది ఏప్రిల్‌ 12న మేజర్‌‌ సినిమాను రిలీజ్‌ చేయాలని అనుకున్నప్పటికీ కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా వాయిదా పడింది.

పాన్‌ ఇండియా సినిమాగా రిలీజ్‌ కాబోతున్న ‘మేజర్’ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రో రేటెడ్‌ డాల్బీ అట్మాస్‌ థియేటర్‌‌లో సౌండ్‌ మిక్సింగ్‌ చేస్తున్న ప్లేస్‌ నుంచి ఫోటోను హీరో అడివి శేష్‌ (Adivi Sesh) ఇటీవల షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎన్‌ఎస్‌జీ కమాండో తాజ్‌హోటల్‌ వైపు తన టార్గెట్‌ను గురిపెట్టినట్టు కనిపిస్తోంది. చారిత్రక నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమా అద్భుతమైన చిత్రీకరణను ఈ ఫోటో తెలియజేస్తోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్‌ మూవీలో సాయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ నటించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!