మనాలిలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ చిత్రీకరణలో అఖిల్‌ (Akhil) ‘ఏజెంట్’.. ఫోటోలు షేర్ చేసిన చిత్ర యూనిట్

Updated on May 25, 2022 06:32 PM IST
మనాలి నుంచి ఏజెంట్‌ చిత్ర యూనిట్‌ పోస్ట్‌ చేసిన ఫోటో
మనాలి నుంచి ఏజెంట్‌ చిత్ర యూనిట్‌ పోస్ట్‌ చేసిన ఫోటో

చిన్నతనంలోనే ‘సిసింద్రీ’ సినిమాలో తన క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ప్రేక్షకుల మది దోచుకున్నాడు అఖిల్ (Akhil). చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి యాక్ట్‌ చేసిన ‘మనం’ సినిమాలో మెరిసిన అందగాడు.. అఖిల్ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు. తాజాగా

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో కెరీర్ లోనే తొలి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తెచ్చిన సక్సెస్ కిక్‌తో తర్వాతి చిత్రం ‘ఏజెంట్’లో ఉత్సాహంగా నటిస్తున్నాడు.  అందులోని క్యారెక్టర్‌‌ కోసం వెరైటీ మేకోవర్‌తో, సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలోని అఖిల్‌ అప్పియరెన్స్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’  సినిమా తర్వాత  దర్శకుడు సురేంద్ర రెడ్డి  అఖిల్‌తో ఏజెంట్‌ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హాలీవుడ్ సూపర్ హిట్  ‘బార్న్’ సిరీస్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మనాలిలో జరుగుతోంది. హై ఓల్టేజ్‌ యాక్షన్ సీక్వెన్సెస్‌ను షూట్‌ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ తెలియచేస్తూ ఒక ఫోటోను కూడా షేర్ చేసింది.  హీరో అఖిల్, దర్శకుడు సురేంద్ర రెడ్డితో పాటు ఇతర టెక్నీషియన్స్ ఆ ఫోటోలో కనిపిస్తున్నారు. 

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ‘ఏజెంట్’ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి విలన్‌గా నటిస్తున్నాడు. ‘యాత్ర’  తర్వాత ఆయన నటిస్తున్న డైరెక్ట్ తెలుగు చిత్రం ఇదే. దేశానికి ముప్పు చేయడానికి కుట్రలు జరుగుతుండడంతో సీక్రెట్ మిషన్ టేకప్ చేస్తాడు హీరో అఖిల్ (Akhil). అందులో భాగంగా ఓ రిటైర్డ్ మిలిటరీ మేజర్‌తో తలపడాల్సి వస్తుంది. చివరికి తన దేశాన్ని రక్షించుకోడానికి హీరో ఎలాంటి సాహసం చేశాడు అన్నదే ఈ సినిమా కథ. మిలిటరీ మేజర్‌గా మమ్ముట్టి నటిస్తుండగా.. సాక్షి వైద్య హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!