సరోజినీ నాయుడు బయోపిక్‌లో భానుప్రియ సోదరి.. అలనాటి తార శాంతిప్రియ (Shanti Priya)

Updated on May 11, 2022 11:12 PM IST
శాంతి ప్రియ (Shanti Priya)
శాంతి ప్రియ (Shanti Priya)

పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమై.. కుటుంబ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అలా దూరమైన చాలా మంది హీరోయిన్లు కొన్ని రోజుల తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అలా వచ్చిన చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్ధిరపడి మంచి పేరు కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆ లిస్టులోకి అప్పటి టాప్‌ హీరోయిన్లలో ఒకరైన భానుప్రియ సోదరి శాంతిప్రియ (Shanti Priya) కూడా చోటు దక్కించుకున్నారు.

పాత ‘మహర్షి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది శాంతి ప్రియ. తెలుగు, తమిళంతోపాటు హిందీ పరిశ్రమలోని పలు విజయవంతమైన సినిమాల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది శాంతి. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. తన పర్సనల్‌ లైఫ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వెండితెరకు తిరిగి రాబోతున్నట్టు వెల్లడించింది. అది కూడా ఒక లేడీ ఓరియెంటెడ్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్యర్యపరిచింది.

స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటించబోతున్నట్టు తెలిపింది శాంతిప్రియ. పెళ్లి అయిన తర్వాత భార్యగా, తల్లిగా తనపై ఉన్న బాధ్యతలను నెరవేర్చాలని అనుకున్నాను. అందుకే సినీ పరిశ్రమకు దూరమయ్యా. ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్లయ్యారు. తాను మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకోవడానికి వాళ్ల ప్రోత్సాహమే కారణం. ఇటీవల సినిమా పరిశ్రమలో పెళ్లి అయిన వాళ్లే కాకుండా, పిల్లలు ఉన్న వాళ్లు కూడా నటిస్తున్నారు. వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం సరోజినీ నాయుడు జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాను. సరోజినీ నాయుడు ఆహార్యం, హావభావాలను సాధన చేస్తున్నాను. వచ్చే నెల నుంచి సెట్స్‌ మీదకు వెళ్లబోయే ఈ సినిమా పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కనుందని చెప్పంది శాంతి ప్రియ (Shanti Priya).

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!