విజయ్ (Vijay) ‘దళపతి 66’ సినిమాలో కీలకపాత్రల్లో శరత్‌ కుమార్, ప్రభు.. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న దిల్‌ రాజు

Updated on May 11, 2022 07:54 PM IST
హీరో విజయ్‌ (Vijay), ప్రొడ్యూసర్ దిల్‌ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి
హీరో విజయ్‌ (Vijay), ప్రొడ్యూసర్ దిల్‌ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి

బీస్ట్‌ సినిమా తర్వాత దళపతి విజయ్‌ (Vijay)  నటిస్తున్న సినిమాలో స్టార్ నటీనటులు నటించబోతున్నారు. త్వరలో షూటింగ్‌ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాను దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో  నిర్మించనున్నట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

తమిళ్‌లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో విజయ్. విజయ్ సినిమా వస్తోందంటే మాస్ ప్రేక్షకులకు పండగే. బీస్ట్ సినిమా ప్రేక్షకులను నిరాశపరచిన తర్వాత విజయ్‌ ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఇక, ఈ సినామ విజయంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే దర్శకుడు వంశీ  కూడా భారీ తారాగణంతోనే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాలోని కీలకపాత్రల కోసం తమిళంలో స్టార్‌‌ యాక్టర్లు శరత్‌ కుమార్, ప్రభును ఎంపిక చేశాడు. దళపతి 66లో రష్మికా మందాన హీరోయిన్‌గా చేస్తోంది.

శరత్‌ కుమార్, ప్రభు, ఎస్‌ఎస్‌ థమన్

ఏ సినిమాకైనా బలం మ్యూజిక్.. ఈ మధ్య కాలంలో బ్యాక్‌ టు బ్యాక్ హిట్ సినిమాలతో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌‌గా కొనసాగుతున్నాడు ఎస్‌ఎస్‌ థమన్. అఖండ, భీమ్లానాయక్, సర్కారు వారి పాట సినిమాలకు మ్యూజిక్ అందించిన థమన్.. సంగీత ప్రియుల నుంచి మంచి మార్కులే కొట్టేశాడు. దీంతో దళపతి 66 సినిమాకు కూడా థమన్‌ నే ఎంపిక చేశారు దర్శకనిర్మాతలు.

ఇక, టాలీవుడ్‌లోని దాదాపు అందరి అగ్రహీరోలతో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై సినిమా తీసిన దిల్‌ రాజు ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో రాంచరణ్‌తో సినిమా నిర్మిస్తున్నాడు. ఆర్‌‌సీ 15 కోసం భారీ బడ్జెట్‌ పెట్టి సినిమా తీస్తున్న దిల్‌ రాజు.. విజయ్‌ సినిమాకి కూడా దాదాపుగా వంద కోట్లు బడ్జెట్‌ కేటాయంచనున్నట్టు తెలుస్తోంది. వరుసగా భారీ పాన్‌ ఇండియా సినిమాలు నిర్మిస్తూ ఖలేజా ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్నాడు దిల్‌ రాజు.  విజయ్ (Vijay), దిల్‌ రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దళపతి 66 ప్రేక్షకులకు ఏ మేరకు చేరువవుతుందో చూడాలి మరి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!