నాగచైతన్యతో పోటీపడనున్న సమంత (Samantha)!

Updated on May 06, 2022 11:57 PM IST
సమంత (Samantha), నాగచైతన్య
సమంత (Samantha), నాగచైతన్య

ఒకప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా అభిమానులను అలరించారు అక్కినేని నాగచైతన్య, సమంత (Samantha) రుతుప్రభు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’తోనే ఇద్దరూ హిట్‌కొట్టి కెరీర్‌లో నిలదొక్కుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ కూడా పుట్టింది. ఆ సినిమా తర్వాత ఇద్దరూ తమతమ సినిమాలతో బిజీగా ఉన్నా కొంతకాలం తర్వాత పెద్దల అంగీకారంతో రెండు మత సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అయితే పళ్లైన నాలుగేళ్లకు విడాకులు తీసుకుని అభిమానులకు షాక్‌ ఇచ్చింది ఈ జంట.

విడాకుల తర్వాత సమంత, నాగచైతన్య గురించి రోజూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. అవి వారి వ్యక్తిగత, వృత్తిగత విషయాలే అయినా ఎవరి సినిమాల పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే తాజాగా సమంత, నాగచైతన్య సినిమాల రిలీజ్‌ డేట్లు ఇప్పుడు వార్తల్లో నిలిచాయి.

అయితే, నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను ఆగస్ట్ 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. చైతూ కీలక పాత్రను పోషించాడు.పలు వాయిదాల తర్వాత ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఎప్పుడో మేకర్స్ తేదీని ప్రకటించారు. అయితే, సమంత ప్రధాన పాత్రలో దర్శక ద్వయం హరి - హరీష్ రూపొందిస్తున్న యశోద సినిమాను ఒక్కరోజు ముందుగా (ఆగస్ట్ 12) రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో సమంతను చూస్తే మరోసారి కొత్త తరహా పాత్రలో కనిపించబోతుందని అర్థమవుతోంది. విలక్షణ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ రెండు చిత్రాల విడుదల తేదీలను పరిశీలిస్తే నాగ చైతన్య, సమంత తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారని అర్థమవుతోంది.

కాగా విడాకుల తర్వాత సినిమాలే కాకుండా రకరకాల పనుల్లో బిజీ అయింది సమంత. స్టార్టప్‌లు, కంపెనీలు స్టార్ట్‌ చేసి బిజినెస్‌లోనూ తానేంటో నిరూపించుకుంటోంది. ఫొటోషూట్లు, సోషల్‌ మీడియాలో పోస్ట్‌లతో ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తున్న సమంత శాంకుతలం సినిమాలో శకుంతల పాత్రను పోషిస్తోంది. విజయ్‌ సేతుపతితో నయనతార, సమంత జంటగా నటించిన కెఆర్‌కె సినిమా రిలీజై ప్రేక్షకులను అలరిస్తోంది. సమంత (Samantha) నటిస్తోన్న మరో రెండు సినిమాలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!