ఎన్టీఆర్‌‌, కొరటాల శివ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి (Saipallavi).. కన్ఫమ్ చేయని చిత్ర బృందం

Updated on May 25, 2022 06:38 PM IST
సాయిపల్లవి, ఎన్టీఆర్
సాయిపల్లవి, ఎన్టీఆర్

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Saipallavi) మరో బంపర్ ఆఫర్ కొట్టినట్టు తెలుస్తోంది. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ వంటి సూపర్‌‌ డూపర్ హిట్‌ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి ఎంపికైనట్టు సమాచారం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి.. టాలీవుడ్‌లోని స్టార్‌‌ హీరోల సరసన ఇప్పటివరకు నటించలేదు.

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30లో సాయిపల్లవి కథానాయికగా ఎంపికైందనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ 30వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ను ఇప్పటివరకు సెలెక్ట్‌ చేయలేదు. ఎన్టీఆర్‌‌ పక్కన చేయడానికి చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ ఎవరినీ ఫైనల్‌ చేయలేదు. అయితే ఈ సినిమా కథ ప్రకారం హీరోయిన్‌గా సాయిపల్లవి అయితే బాగుంటుందని దర్శకుడు కొరటాల భావిస్తున్నాడని టాక్.

మరోపక్క కథ నచ్చితేనే సినిమా చేయడానికి అంగీకరించే సాయిపల్లవి (Saipallavi ) కూడా ఎన్టీఆర్ పక్కన నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. ఎన్టీఆర్‌‌ 30లో హీరోయిన్‌ను తారక్‌ పుట్టినరోజునే ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అయితే అప్పటికి ఎంపిక పూర్తికాలేదు. అదే రోజు రిలీజ్‌ చేసిన సినిమా ఫస్ట్‌ లుక్‌కు తారక్‌ అభిమానుల నుంచే కాకుండా.. సినీ ప్రేమికుల నుంచి కూడా విశేష స్పందన లభించింది.

ఇక, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా బంపర్‌‌ హిట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తారక్‌ ఇమేజ్‌ కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో తారక్‌ రేంజ్‌కు సరిపోయే విధంగా సినిమా కథలో డైరెక్టర్ కొరటాల శివ భారీ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. సాయిపల్లవి (Saipallavi)  కీలక పాత్ర పోషించిన ‘శ్యామ్ సింగరాయ్’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఆమె నటించిన ‘విరాటపర్వం’ త్వరలో విడుదల కాబోతోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!