ఎటువంటి రోల్ అయినా చేస్తా.. నటనకు ఇంపార్టెన్స్‌ ఉండాలంటున్న నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj)

Updated on May 17, 2022 11:30 PM IST
నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj)
నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj)

శ్రీ విష్ణు హీరోగా నటించిన 'మెంటల్‌ మదిలో' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj). బ్రోచేవారెవరురా, అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ బొమ్మ. 'పాగల్‌' తదితర సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేసి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. తక్కువ సినిమాలు చేసిన నివేదాకు.. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి క్రేజ్‌ వచ్చింది. ఇటీవల 'బ్లడీ మేరీ' చిత్రంలోనూ నటించి ఆకట్టుకుంది. అయితే స్టార్‌ హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయిందీ ముద్దుగుమ్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన నివేదా పేతురాజ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.  

‘హీరోయిన్‌ అనిపించుకోవడం కంటే కూడా మంచి నటి అనిపించుకోవడం గర్వంగా ఉంటుంది. కథానాయికగా సినిమాలు చేయకపోతే కెరీర్‌ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. కానీ నాకు అలాంటి భయం ఏమీ లేదు. నటనకు ఇంపార్టెన్స్‌ ఉంటే ఎటువంటి రోల్స్‌ చేయడానికైనా రెడీ.  ఎలాంటి బౌండరీస్‌ పెట్టుకోలేదు. సినిమా ఆఫర్లు రాకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకుంటా’ అని తెలిపింది నివేదా పేతురాజ్‌.

నటీనటులకు ఉన్న ఒక అదృష్టం అభిమానులు. పాండిచ్చేరిలో షూటింగ్ లో ఉన్నప్పుడు ఓ అభిమాని వచ్చి తన చేయి చూపించాడట.. తన పేరు పచ్చ బొట్టు వేయించుకున్న అభిమానానికి షాక్ అయ్యాను. ఇంత అభిమానాన్ని నటులు మాత్రమే చూడగలుగుతారు.  

నటనలో ఆరాధించేది విజయ్ సేతుపతిని, ఎందుకంటే.. వయసుతో సంబంధం లేకుండా ఏ పాత్ర చేయడానికైనా రెడీ అయిపోతారు. హీరోగా చేస్తూనే.. విలన్ గా, హీరోయిన్ ఫాదర్ గా కూడా చేశారు..అలా ఇమేజ్‌తో సంబంధం లేకుండా విజయ్ సేతుపతిలా ఉండాలి అనిపిస్తుంది ఎంత పని వత్తిడి ఉన్నా.. ఒక్క కాఫీతో రిలాక్స్‌ అయిపోతుంటా. జీవితంలో ఒత్తిడి జయించాలంటే.. మెడిటేషన్ ఒక్కటే మార్గం అంటోంది నివేదా. ఇక, నివేదా (Nivetha Pethuraj) నటించిన  'విరాట పర్వం' సినిమా జూలై 1న విడుదల కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!