లేడీ గ్యాంగ్‌తో సందడి చేసిన రష్మికా మందాన (Rashmika Mandanna) .. ఫ్రెండ్ పెళ్లిలో శ్రీవల్లి పిక్స్‌ వైరల్

Updated on May 16, 2022 06:51 PM IST
ఫ్రెండ్స్​తో రష్మికా మందాన (Rashmika Mandanna)
ఫ్రెండ్స్​తో రష్మికా మందాన (Rashmika Mandanna)

యాక్టర్‌‌గా ఈ ప్రపంచానికి పరిచయం కాకముందు నా లైఫ్‌ ఇలా ఉండేది అంటూ తన పర్సనల్ లైఫ్‌కు చెందిన విషయాలు పంచుకుంది హీరోయిన్ రష్మికా మందాన (Rashmika Mandanna). సౌత్, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న రష్మిక.. వరుసగా సినిమాలు చేస్తోంది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా తన చిన్ననాటి స్నేహితులను చూసేసరికి చిన్నపిల్లలుగా మారిపోతారు. తాజాగా తన చిన్నప్పటి స్నేహితురాలి పెళ్లికి హాజరైంది. దానికోసం షూటింగ్స్‌ నుంచి బ్రేక్ తీసుకుంది రష్మిక.

ఫ్రెండ్‌ పెళ్లిలో తన లేడీ గ్యాంగ్‌తో కలిసి సందడి చేసింది. సాంప్రదాయ దుస్తులు ధరించి.. పెళ్లి కూతురుతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌‌ చేసింది శ్రీవల్లి. ‘ఈరోజు నా బెస్ట్‌ ఫ్రెండ్‌ రాగిణికి పెళ్లి. ఈరోజు తర్వాత తనతో నేను ఫోటోలు దిగలేను. ఈరోజుని మిస్‌ చేసుకోవాలని అనుకోలేదు. ఉదయం 4 గంటలకు ఉన్న ఫ్లైట్‌ మిస్‌ అయ్యింది. మరో ఫ్లైట్‌ కూడా నాలుగు నుంచి ఐదుసార్లు లేట్‌ అయ్యింది. వరుసగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో రాగిణి పెళ్లికి హాజరుకాలేనని అనుకున్నా. దేవుడి దయతో ఈ పెళ్లికి హాజరయ్యాను. ఈ గర్ల్‌ గ్యాంగ్‌లోనే పెరిగాను. దాదాపు17  సంవత్సరాల నుంచి వీళ్లు నాకు పరిచయం. ఇప్పటికీ  వాళ్లలో ఏ మార్పు రాలేదు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. వీళ్లంతా నా వాళ్లు. వీళ్లని కలవడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితానికి సంబంధించిన ఓ విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నా. అదేమిటంటే.. నటిగా రష్మిక మీకు పరిచయం కాకముందు ఇలాగే ఉండేది. ఇప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు’ అని రష్మిక ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

మరోవైపు.. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న‌కు మంచి గుర్తింపు ఉంది. ర‌ష్మిక సెలెక్ట చేసుకునే సినిమాలు దాదాపు హిట్ అవుతాయి. బాలీవుడ్ జెర్సీలో యాక్ట్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణాలు చెప్పింది ర‌ష్మిక మంద‌న‌. టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ ఆఫ‌ర్ల కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. హిందీ సినిమా న‌టులు తెలుగులో యాక్ట్ చేయాల‌ని ఉత్సాహ ప‌డుతున్నారు. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న‌కు జెర్సీ హిందీ రీమేకింగ్ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ వ‌చ్చింద‌ట‌. కానీ ర‌ష్మిక ఆ సినిమాలో యాక్ట్ చేయ‌న‌ని చెప్పింద‌ట‌. 

బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటించిన జెర్సీ  బాక్పాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. అంత హిట్ టాక్ తెచ్చుకోలేక‌పోయింది. తెలుగు హీరో నాని చేసిన జెర్సీనీ హిందీలో రీమేక్ చేశారు షాహిద్ క‌పూర్. తెలుగులో వ‌చ్చినంత గుర్తింపు ఈ సినిమాకు హిందీలో రాలేదు.  షాహిద్‌ భార్యగా బాలీవుడ్‌ నటి మృణాల్‌ ఠాకుర్‌ నటించింది. మొద‌ట జెర్సీ సినిమాలో షాహిద్ భార్య‌గా ర‌ష్మిక మంద‌నాను న‌టించ‌మ‌ని అడిగార‌ట‌. ఆయితే ఆ ఆఫ‌ర్ ర‌ష్మిక తిర‌స్క‌రించారు. అప్ప‌ట్లో ఈ పాత్ర తిర‌స్క‌రించింద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. 

హిందీ జెర్సీ ఆఫ‌ర్ గురించి ర‌ష్మిక మంద‌న రీసెంట్‌గా కామెంట్ చేశారు. షాషిద్‌తో క‌లిసి జెర్సీలో న‌టించమ‌ని అడిగార‌ని.. అందుకు తాను ఒప్పుకోలేద‌ని ర‌ష్మిక చెప్పారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టించే తాను జెర్సీ సినిమాలో మాత్రం న‌టించ‌లేక‌పోయాను. నేను శ్రద్ధా శ్రీనాథ్ అంత గొప్ప‌గా న‌టించేదాన్ని కాదేమో.. త‌న వ‌ల్ల ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు న‌ష్ట‌పోకూడ‌దంటూ చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం రష్మిక మంద‌న‌(Rashmika Mandanna) తెలుగు పుష్ప 2తో పాటు హిందీలో యానిమల్‌ చిత్రాలతో బిజీగా ఉంది. 

ఫ్రెండ్​​తో రష్మికా మందాన (Rashmika Mandanna)

ఫ్రెండ్​​తో రష్మికా మందాన (Rashmika Mandanna)

ఫ్రెండ్స్​​తో రష్మికా మందాన (Rashmika Mandanna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!