శేఖర్‌‌ (Sekhar) : సినిమా సెన్సార్‌‌ పూర్తి.. సీబీఎఫ్‌సీ ఇచ్చిన సర్టిఫికెట్‌ ఏంటంటే?

Updated on May 22, 2022 02:39 PM IST
శేఖర్‌‌ సినిమా పోస్టర్
శేఖర్‌‌ సినిమా పోస్టర్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) ‘శేఖర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆయన భార్య జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సీబీఎఫ్‌సీ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఆన్‌లైన్‌ ద్వారా ప్రకటించింది.

జీవిత రాజశేఖర్‌‌ దర్శకత్వంలో తెరకెక్కిన  ‘శేఖర్’ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శేఖర్ సినిమాలో రాజశేఖర్, జీవితల కూతురు శివాని రాజశేఖర్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకురాలు జీవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు.

'కొన్ని పరిస్థితుల కారణంగా నేను డైరెక్షన్‌ చేయాల్సివచ్చింది. నాకు డైరెక్షన్‌పై ఇంట్రెస్ట్‌ లేదు. తమిళ సూపర్‌ హిట్‌ సినిమా స్టోరీతో, శేషు తీయాలని అనుకున్నాం. కానీ దానికి ఏ డైరెక్టర్‌ ఒప్పుకోలేదు. దాంతో నేనే ఆ సినిమాకు దర్శకత్వం వహించాను. మలయాళంలో హిట్‌ అయిన 'జోసెఫ్‌' సినిమాను తెలుగులో. 'శేఖర్‌' పేరుతో తెరకెక్కించాం. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది.

మా ఫ్యామిలీకి ఎవరితోనూ గొడవల్లేవు. కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని తిప్పితిప్పి రాస్తూ, యూట్యూబ్‌లో థంబ్‌ నయిల్స్‌ పెడుతూ.. మామధ్య దూరాన్ని పెంచుతున్నారు' అని జీవిత చెప్పారు.

'వారం రోజుల్లో 'శేఖర్‌‌' సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుందని అనుకుంటుండగా, రాజశేఖర్‌‌కు కరోనా సోకింది. చాలా సీరియస్ అయ్యింది. రాజశేఖర్‌‌ రికవర్ అయ్యాక, సినిమా షూటింగ్ స్టార్ట్‌ చేశాం. 'శేఖర్‌‌' సినిమాలో కూతురు క్యారెక్టర్‌‌కి స్క్రీన్‌ స్పేస్‌ చాలా తక్కువ. కొత్త అమ్మాయిని తీసుకొచ్చి ఫాదర్,  డాటర్ రిలేషన్‌షిప్ బిల్డప్ చేయడం కంటే.. శివానినే కూతురిగా చేయిస్తే బాగుంటుందని అనుకున్నాం.

రాజశేఖర్ (Rajasekhar) నెగెటివ్ రోల్స్ చేస్తారా.. అని చాలామంది అడుగుతున్నారు. తన జర్నీ విలన్​గానే మొదలైంది. తర్వాత హీరోగా బిజీ అయ్యారు. రాం చరణ్ ‘ధ్రువ’ సినిమాలోని అరవిందస్వామి, ‘పెదరాయుడు’లోని రజినీకాంత్ క్యారెక్టర్ వంటి మంచి క్యారెక్టర్లు వస్తే తప్పకుండా చేస్తారు. చిరంజీవి గారు ఆఫర్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి క్యారెక్టర్ ఏది వచ్చినా. చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నా' అని జీవిత అన్నారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్‌ సినీ కార్ప్‌, సుధాకర్‌‌ ఇంపెక్స్‌ ఐపీఎల్,  త్రిపురా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. వంకాయలపాటి మురళీకృష్ణ శేఖర్‌‌ సినిమాను సమర్పిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!