పెళ్లి చేసుకోబోతున్న రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna).. ఫియాన్సీకి లిప్లాక్ ఇస్తున్న ఫొటో షేర్ చేసిన నటుడు

Updated on May 08, 2022 06:55 PM IST
సోషల్‌ మీడియాలో రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) పోస్ట్‌ చేసిన ఫోటో
సోషల్‌ మీడియాలో రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) పోస్ట్‌ చేసిన ఫోటో

‘అర్జున్​ రెడ్డి’ సినిమాలో హీరో ఫ్రెండ్​గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు​ రాహుల్​ రామకృష్ణ. తన సహజ నటన, డైలాగ్​ డెలివరీతో తక్కువ టైంలో మంచి కమెడియన్​గా ఎదిగి ​ వరుస సినిమాలతో దూసుకుపోతున్న రాహుల్ త్వరలోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడవబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఫియాన్సీకి లిప్​లాక్​ ఇస్తున్న ఫొటో షేర్​ చేసి మరీ సోషల్​ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు ఈ యంగ్​ కమెడియన్​.

తాను త్వరలో ఓ ఇంటివాడిని కాబోతున్నట్లు ట్విటర్​ వేదికగా తెలిపాడు రాహుల్​. తన ఫియాన్సీతో ఘాటుగా లిప్ కిస్ లో మునిగితేలుతున్న ఫోటో షేర్ చేస్తూ.. ‘ఎట్టకేలకు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా’ అంటూ కామెంట్ పెట్టాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అభిమానులు రాహుల్ రామకృష్ణకి శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇటీవల విశ్వక్ సేన్ వివాదంలో రాహుల్ రామకృష్ణ సదరు టీవీ ఛానల్ పై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. టీఆర్పీ, డబ్బు కోసమే ఆ ఛానల్ పనిచేస్తోంది అంటూ రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా రాహుల్ రామకృష్ణ తన ఫియాన్సీతో ఉన్న ఫోటో విషయంలో కూడా ఆ చానల్ పై సెటైర్లు వేశాడు. ఈ ఫోటోపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు డిబేట్ పెట్టండి. నేను నా ఫియాన్సీ తప్పకుండా డిబేట్ కి వస్తాం.. మీరు ఇలాంటివి చేస్తారు కదా అంటూ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కాగా,  రాహుల్​ షేర్​ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇప్పుడు ముద్దులు పెట్టే ఫొటో పోస్ట్ చేశారు.. రేపు బెడ్ సీన్స్ పెడతారా?’’ ఏంటి అంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. కొంచెం ఇమేజ్ వస్తే చాలు ఇలా దిగజారిపోవడమేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 

‘‘కంగ్రాట్స్ అన్నా. కానీ, ఇలా లిప్ లాక్ ఫొటో కాకుండా వేరే ఫొటో పెట్టి ఉంటే బాగుండేది. మీరు చేసిందేం బాగాలేదు. మీ కుటుంబానికి గౌరవం ఇవ్వలేదు’’ అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు. జనాలను సగం చెడగొడుతున్నది సినిమా వాళ్లేనంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. నాలుగు గోడల మధ్య జరిగేది.. ఇలా పబ్లిక్ గా పోస్ట్ పెట్టి సమాజానికి చెప్పాలా? అంటూ మరో వ్యక్తి మెసేజ్ పెట్టాడు.

 

ఫేమస్ అయ్యేందుకు భార్యను కూడా చీప్ చేస్తావా? అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. అయితే, మరికొందరు మాత్రం రాహుల్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అందులో తప్పేముందంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. నీతులు చెప్పడం ఆపాలంటూ ట్రోల్స్ చేస్తున్న వారికి సూటిగా చెబుతున్నారు.

అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతి రత్నాలు లాంటి చిత్రాల్లో రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) తనదైన మార్క్ ప్రదర్శించాడు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాహుల్ రామకృష్ణ  కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో రామకృష్ణ ది చాలా ఇంపార్టెంట్ రోల్. ఒక రకంగా చెప్పాలంటే కథని మలుపు తిప్పే పాత్ర. ఎన్టీఆర్ పక్కన అద్భుతంగా నటించాడని అందరి ప్రశంసలు అందుకున్నాడు రాహుల్.​

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!